గలీజ్ పనులకు నిలువెత్తు రూపం వైఎస్ జగన్ ...సిబీఐ ఛార్జిషీట్ వదిలింది అందుకే : బుద్దా కౌంటర్

టిడిపి నేత బుద్ధా వెంకన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, అలాగే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక చంద్రబాబు చేసిన గలీజ్ పనులు ఇవే అంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడిన బుద్ధావెంకన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గలీజ్ పనులుకి నిలువెత్తు రూపం అంటూ నిప్పులు చెరిగారు.

 సిబీఐ బల్లగుద్ది మరీ ఛార్జిషీట్ వదిలింది అందుకే

సిబీఐ బల్లగుద్ది మరీ ఛార్జిషీట్ వదిలింది అందుకే

ఇక ట్విట్టర్ వేదికగా స్పందించిన బుద్ధా వెంకన్న గలీజ్ పనులకు నిలువెత్తు రూపం వైయస్ జగన్. గోతులు తవ్వడం, చీకటి వ్యవహారాలు,మ్యానిప్యులేషన్ లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి అని సిబీఐ బల్లగుద్ది మరీ ఛార్జిషీట్ వదిలింది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, జగన్ పై బుద్ధా వెంకన్న వ్యాఖ్యలు చేసి కౌంటర్ ఇచ్చారు. ఇక అంతే కాదు వ్యవస్థలను మేనేజ్ చేసి అధికారులను జైలుకు పంపడం జగన్ రెడ్డి నైజం అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు బుద్ధా వెంకన్న.

 వాళ్ళను మోసం చేసి మోసగాడిగా మిగిలి పోయావ్

వాళ్ళను మోసం చేసి మోసగాడిగా మిగిలి పోయావ్

మరొక ట్వీట్ లో వైయస్ జగన్మోహన్ రెడ్డి శివకుమార్ స్థాపించిన పార్టీని కబ్జా చేశారని, కాంగ్రెస్ పార్టీని మోసం చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.తండ్రిని ముఖ్యమంత్రిగా చేసి మిమ్మల్ని కుబేరుల్ని చేసిన సోనియాగాంధీని, కాంగ్రెస్ పార్టీని మోసం చేసి మోసగాడిగా మిగిలి పోయావ్ అంటూ జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. అధికారం శాశ్వతం అనుకుంటున్న మీకు త్వరలోనే మబ్బులు విడిపోవడం ఖాయమంటూ బుద్ధా వెంకన్నతేల్చి చెప్పారు.

జగన్ పాలనలో జరుగుతున్నవివే

జగన్ పాలనలో జరుగుతున్నవివే

ఇక బియ్యంలో పెళ్లలు, శనగల్లో రాళ్ళు ,కందిపప్పు ప్యాకెట్లలో పిన్నులు , బ్లీచింగ్ లో మైదా, ఆదరణ పథకం లో ఇచ్చిన పనిముట్లకు వైయస్ జగన్ స్టిక్కర్లు, ఇక టిడిపి హయాంలో కట్టిన నిర్మాణాలకు వైసిపి రంగులు, యంగ్ స్టార్ విస్కీ, ఆంధ్ర గోల్డ్ విస్కీ.. అంతేనా ఆల్రెడీ ఉన్న పథకాలకు పేర్లు మార్పు అంటూ జగన్ ప్రభుత్వ హయాంలో ఏం జరుగుతుందో చెప్పి అటు విజయసాయిరెడ్డిని, ఇటు జగన్ ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు బుద్ధా వెంకన్న.

Recommended Video

    YSR Kapu Nestham Scheme Launched రాష్ట్ర వ్యాప్తంగా 2,37,873 మంది కాపు మహిళలకు రూ.15వేల ఆర్ధిక సాయం
    నూటికి నూరు శాతం హామీలు అమలు చేసేశారు కదా అంటూ సెటైర్లు

    నూటికి నూరు శాతం హామీలు అమలు చేసేశారు కదా అంటూ సెటైర్లు

    ఇక విజయసాయి 90 శాతం హామీలు అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని బుద్దా వెంకన్న సెటైర్లు వేశారు .అబ్బో.. 90 శాతం ఏంటి నూటికి నూరుశాతం హామీలన్నీ అమలు చేసేశారు కదా సాయి రెడ్డి అంటూ బుద్ధా వెంకన్న వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబును టార్గెట్ చేసి విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బుద్ధా వెంకన్న ధీటుగా సమాధానం ఇచ్చారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+