విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో.. వీడేం మనిషి రా బాబు.. దొంగతనం అని పిలిచి, బట్టలూడ దీసి, కొట్టి.. ఆ తర్వాత

|
Google Oneindia TeluguNews

కొందరు నీచులకు మంచి, మానవత్వ ఉండదు. సమయం, సందర్భం కూడా తెలియదు. ఎవరినయిన సరే అనుమానించడమే.. అవమానించడమే.. అయితే వారు చేస్తున్న పని వల్ల చిన్న చూపు చూస్తున్నారు. మనిషిని, మనిషి మాదిరిగా చూడాలి.. అదీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున దారుణంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.

మహిళా దినోత్సవం రోజు కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. దొంగతనం నెపంతో ఇద్దరు మహిళలను హింసించాడు. చందర్లపాడు మండలం ముప్పాల గ్రామంలో రోల్డ్ గోల్డ్ నగలు వీధి వీధికి తిరిగి మహిళలు అమ్ముకుంటున్నారు. వారి పని అదీ.. అలా విక్రయించి కడుపు నింపుకుంటున్నారు. సాయంత్రం తిరిగి తమ ఇంటికి వెళుతుంటారు. అలా నందిగామ వెళ్తుండగా ఒక ఇంటి యజమాని వారిని అడ్డుకున్నాడు. ఏం చెబుతాడో అని అనుకున్నారు.. కానీ అతను నీచంగా బీహెవ్ చేశాడు. అవును వారి పట్ల అమనుషంగా ప్రవర్తించాడు.

man misbehave two woman at krishna district

తమ ఇంట్లో బంగారం పోయిందని.. అది మీరే దొంగిలించారని చెప్పాడు. వారిని ఇంట్లోకి తీసుకు వెళ్లి బట్టలు ఊడదీసి కొట్టాడు. అంతటితో ఊరుకోలేదు వాతలు కూడా పెట్టాడు. అయితే మళ్లీ వెతకగా ఇంట్లోనే బంగారం దొరకింది. దీంతో మొహం చిన్న చేసుకున్నాడు. పొరపాటు అయ్యిందని చెప్పి దగ్గరుండి వారిని ఆటో ఎక్కించి పంపించాడు. అంతేకాదు మీ భర్తలకు జరిగిన విషయం చెపితే ప్రాణాలు తీస్తానంటూ హెచ్చరించాడు. అలా అతను బెదిరించడంతో భయపడిపోయారు.

ఆ ఇద్దరు మహిళలు చందర్లపాడు చేరుకున్నారు. అక్కడ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ పట్ల దారుణంగా ప్రవర్తించారని చెప్పారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కానీ సదరు మహిళలతో ఇలా చేయడం సరికాదు. దొంగతనం పేరుతో నగ్నంగా ఉంచడం ఏంటీ అని అడుగుతున్నారు. ఇదీ సరికాదు అని అంటున్నారు. సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరొకరు ఇలా చేసేందుకు సాహసించొద్దు అని కొందరు అంటున్నారు.

English summary
A man misbehaves two women at krishna district. he call to two woman and remove her clothes for suspicion of theft.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X