చంద్రబాబు కొడుకును గెలిపించుకోలేని చవట దద్దమ్మ.. చిన్న మెదడు చితికింది.. ఏకిపారేసిన రోజా

అమరావతి: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో బాధగా ఉందన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో రోజా మాట్లాడారు.

జగన్ తిరిగు తపాలాలో అంటూ చంద్రబాబు..

జగన్ తిరిగు తపాలాలో అంటూ చంద్రబాబు..

వైఎస్ జగన్.. తన కొడుకు లోకేష్ ఇద్దరూ చదవుల కోసం అమెరికా వెళ్లారని చంద్రబాబు అంతకుముందు సభలో ప్రస్తావించారు. అయితే, తన కొడుకు అక్కడే ఉండి చదువుకుంటే.. జగన్ మాత్రం తిరిగు తపాలాలో ఇక్కడికే తిరిగి వచ్చాడని ఈ విషయాన్ని అప్పడు వైఎస్‌తోనే చెప్పానని చంద్రబాబు గుర్తుచేశారు.

మందబుద్ధి కొడుకంటూ..

మందబుద్ధి కొడుకంటూ..

అనంతరం రోజా మాట్లాడుతూ.. ‘నా(చంద్రబాబు) కొడుకు ఫారెన్‌లో చదివాడని చెబుతున్నావు.. ఆయనకు ఏపీ దేశమో రాష్ట్రమో కూడా తెలియదు. వర్ధంతి.. జయంతికి కూడా తేడా తెలియదు. తాను నిల్చున్న మంగళగిరిని మందలగిరి అనే మందబుద్ధి గల కొడుకుని కని.. జగన్‌ని అంటారా?' అని రోజా విమర్శించారు.

ఎర్రగడ్డ నుంచే వచ్చారు..

ఎర్రగడ్డ నుంచే వచ్చారు..

సోమవారం మహిళల భద్రతపై మాట్లాడుతుంటే.. ఉల్లిపాయలతో ఆందోళన చేశారని టీడీపీ సభ్యులపై రోజా మండిపడ్డారు. అచ్చెన్నాయుడు తన సైజుకు తగ్గట్లుగా పెద్ద ఉల్లిగడ్డ తెచ్చారని.. అది రైతు బజార్ నుంచి తెచ్చారా? లేక హెరిటేజ్ నుంచి తెచ్చారో చెప్పాలని రోజా అన్నారు. ఇప్పుడు సమయం ఇస్తే బయట తిరుగుతున్నారని మండిపడ్డారు. ఏదో ప్రజల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ సభ్యులు ఉల్లిపాయల గురించి రాలేదు.. ఎర్రగడ్డ నుంచి వచ్చారనే విషయం అర్థమైందని రోజా అన్నారు. చంద్రబాబు పాలనలో రైతులు 90శాతం అప్పులపాలయ్యారని, మద్దతు ధర రాక నలిగిపోయారని రోజా ఆరోపించారు. చంద్రబాబు రైతులను మోసం చేశారని అన్నారు.

వీధి రౌడీలా.. చంద్రబాబు..

వీధి రౌడీలా.. చంద్రబాబు..

వైఎస్ జగన్ రైతుల కోసం రైతు భరోసాను ఐదేళ్లకు పొడిగించారని రోజా చెప్పారు. ఇలాంటి సీఎం జగన్‌ను పెద్ద మనిషిగా ఆశీర్వదించాల్సింది పోయి.. వీధి రౌడీలా ప్రవర్తించారని రోజా చంద్రబాబుపై మండిపడ్డారు. సాంబిరెడ్డి మరణంపై చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేశారని.. ఇందుకు సభకు, ఆయన కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు చిన్నమెదడు చితికిపోయిందంటూ..

చంద్రబాబు చిన్నమెదడు చితికిపోయిందంటూ..

సొంత కొడుకుని గెలిపించుకోలేని చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రిగా మిగిలిపోయారని చంద్రబాబుపై రోజా తీవ్ర విమర్శలు చేశారు. ఈయన జగన్ గురించి చెప్తే తక్కువ ఎక్కువ అయ్యేదేమీ లేదని అన్నారు. చంద్రబాబుకు చిన్నమెదడు చితికిపోయిందని.. డాక్టర్‌కి చూపిస్తే మంచిదని రోజా తీవ్రంగా స్పందించారు. ఆయన వల్లే టైమ్ వేస్టేనని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+