సూపర్ స్టార్ కృష్ణపై అభిమానాన్ని చాటుకున్న కమల్ హాసన్: బెజవాడ, వైజాగ్‌లల్లో షూటింగ్
విజయవాడ: లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తోన్న తాజా చిత్రం.. థగ్ లైఫ్ (Thug Life). ఇది ఆయన నటిస్తోన్న 234వ సినిమా. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ సొంతంగా దీన్ని నిర్మిస్తోన్నారు. మణిరత్నం దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతోన్న పాన్ ఇండియా సినిమా ఇది.
Recommended Video

సుదీర్ఘ విరామం కమల్ హాసన్- మణిరత్నం కాంబో రాబోతోండటంతో దీనిపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. త్రిష, జయం రవి, దుల్కర్ సల్మాన్.. ఇతర కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. ఇటీవలే థగ్ లైఫ్ టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను విడుదల చేసింది చిత్రం యూనిట్. దీనికి మంచి రెస్పాన్స్ లభించింది.

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తోన్న ఇండియన్ 2 షూటింగ్ కూడా శరవేగంగా కొనసాగుతోంది. 2024 ఏప్రిల్ 12వ తేదీన విడుదల కానుంది. భారతీయుడు మూవీకి సీక్వెల్ ఇది. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్, గురు సోమసుందరం తదితరులు నటిస్తోన్నారు.
బ్లాక్ బస్టర్ విక్రమ్ తరువాత కమల్ హాసన్ నటిస్తోన్న తాజా సినిమాలు ఇవే కావడంతో హైప్ క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాల షూటింగ్‌లో తీరిక లేకుండా గడుపుతున్న ఉన్న కమల్ హాసన్.. ఈ ఉదయం విజయవాడలో ప్రత్యక్షం అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేవినేని అవినాష్‌తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారాయన.
విజయవాడ గురునానక్ కాలనీ సమీపంలో ఉన్న కనకదుర్గ గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ పార్క్‌లో ఈ విగ్రహం ఏర్పాటైంది. ఈ ఉదయం సరిగ్గా 7:02 నిమిషాలకు కమల్ హాసన్ద దీన్ని ఆవిష్కరించారు. పెద్ద ఎత్తున సూపర్ స్టార్ కృష్ణ- మహేష్ బాబు అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications