విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొడాలి నానీపై టీడీపీ నేతల రివర్స్ అటాక్ ... నువ్వే ఓ దద్దమ్మ, బూతుల మంత్రి అంటూ విసుర్లు

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబుపై చవట, దద్దమ్మ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానీని టిడిపి నేతలు టార్గెట్ చేస్తున్నారు. కొడాలి నాని సభ్యతా సంస్కారాలు తెలియని వ్యక్తని, చిన్ననాటి నుండి సభ్యతా సంస్కారాలతో పెరిగిన వాడు కాదని టిడిపి నేత వర్ల రామయ్య విమర్శించారు. కొడాలి నాని బూతుల మంత్రి అని నిప్పులు చెరిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కోర్టు ఇచ్చిన స్టే పై చదువు సంధ్య లేని కొడాలి నాని మాట్లాడడం శోచనీయమన్నారు.

 విచారణ ఎదుర్కోలేని చవట ,దద్దమ్మ చంద్రబాబు .. ఆయన స్టేల బాబు : కొడాలి నాని ఫైర్ విచారణ ఎదుర్కోలేని చవట ,దద్దమ్మ చంద్రబాబు .. ఆయన స్టేల బాబు : కొడాలి నాని ఫైర్

అసలు రాజ్యాంగం అంటే ఏమిటో తెలియని వ్యక్తి ఏపీ మంత్రిగా ఉండడం ప్రజలకు సిగ్గుచేటు అని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP leaders varla ramaiah , jawahars reverse attack on Minister Kodali Nani

కొడాలి నానీ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు . ఇదే సమయంలో చంద్రబాబును దద్దమ్మ అన్న కొడాలి నాని నే పెద్ద దద్దమ్మ అని మాజీ మంత్రి జవహర్ ఎద్దేవా చేశారు. కొడాలి నాని మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు పై అవాకులు చవాకులు పేలడం మానుకోవాలని జవహర్ హితవుపలికారు.

కొడాలి నాని తన పదవిని కాపాడుకోవడం కోసం ఏది పడితే అది మాట్లాడుతున్నాడని మండిపడ్డారు . కొడాలి నాని ఎవరు సంతృప్తి కోసం ఈ విధంగా మాట్లాడుతున్నారు చెప్పాలని టిడిపి నేత జవహర్ డిమాండ్ చేశారు. బెయిల్ రెడ్డి గురించి నాని ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు జవహర్. కొడాలి నాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. మరోవైపు ఏ మాత్రం చిన్న అవకాశం వచ్చినా మంత్రి కొడాలి నాని చంద్రబాబును , లోకేష్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు .

English summary
TDP leaders Varla Ramaiah and Jawahar made harsh remarks on Minister Kodali Nani. they said Kodali nani did not grow with politeness and culture . Kodali Nani, who could not read the stay order given by the High Court in the Chandrababu case, said it was unfortunate. Kodali, who has no understanding of the constitution, said it was a shame for the people of the state to be a minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X