విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ డ్రోన్ వీడియో.. వావ్ అంటోన్న నెటిజన్లు..

|
Google Oneindia TeluguNews

కనకదుర్గ ప్లై ఓవర్ పనులు పూర్తయిన సంగతి తెలిసిందే. టెస్ట్ రన్ కొనసాగుతోంది. వచ్చేనెలలో ప్లై ఓవర్ ప్రారంభించబోతున్నారు. అయితే ఫ్లై ఓవర్‌కి సంబంధించి డ్రోన్ ద్వారా ఒక వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫ్లై ఓవర్‌తో విజయవాడ నగరం దాదాపుగా కనిపించి.. కనువిందు చేస్తోంది. ఆ దృశ్యం మనోహరంగా ఉంది.

గత ప్రభుత్వ హయాంలోనే ఫ్లై ఓవర్ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. కేంద్రం సాయంతో జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మాణం ప్రారంభించారు. అలా సాగుతూ.. ఇటీవల పూర్తయ్యింది. విజయవాడ బస్టాండ్ నుంచి పున్నమి ఘాట్ వరకూ 2.3 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రూ.440 కోట్లతో పనులు చేపట్టారు.

vijayawada kanaka durga flyover drone video..

విజయవాడ బస్టాండ్ దాటాక కృష్ణానదిని ఆనుకుని ప్రకాశం బ్యారేజీ పక్కనే గల కృష్ణా కాలువపై నుంచి సాగే ఫ్లైఓవర్ కనకదుర్గ గుడి వద్ద ఏకంగా నదిలోకి వెళ్లిందా అనుకునేలా కనిపిస్తోంది. ఇక్కడ ఉన్న ఇరుకైన మార్గంలో ఇలాంటి ఫ్లైఓవర్ నిర్మించే అవకాశం ఉందని ప్రజలు కూడా అనుకోలేదు. కానీ రాష్ట్రంలో అత్యంత పొడవైన ఫ్లై ఓవర్‌గా నిర్మాణం జరిగింది. జాతీయ రహదారిపై ఉన్న ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది.

>> >>

Recommended Video

Krishna River : ప్రకాశం బ్యారేజీకి 4 లక్షల క్యూసెక్కుల వరద, అప్రమత్తంగా ఉండాలని CM Jagan ఆదేశాలు !

వాస్తవానికి 9 నెలల్లోనే ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తిచేస్తామని గత టీడీపీ ప్రభుత్వం బీరాలు పలికింది. అయితే కేంద్రం నుంచి సకాలంలో నిధులు మంజూరు కాలేదు. దీంతో నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి పచ్చాక కేంద్రంతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో నిధుల విడుదలయ్యాయి. దీంతో ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేసుకుంది.

English summary
vijayawada kanaka durga flyover drone video viral in social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X