GVMC corporators : కులుమనాలీ కొండల్లో వైజాగ్ కార్పోరేటర్లు-విరిగిపడిన కొండచరియలు

విశాఖ మహానగరపాలక సంస్ధ జీవీఎంసీకి చెందిన దాదాపు 100 మంది కార్పోరేటర్లు,వారి కుటుంబసభ్యులు స్టడీ టూర్ పేరుతో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కులుమనాలీ దాటిన తర్వాత ఘాట్ రోడ్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో వీరంతా అక్కడ చిక్కుకుపోయారు.

కులు మనాలి నుంచి చండీగఢ్ వెళ్తుండగా కొండ చరియలు విరిగిపడి ఘాట్ మధ్యలో కార్పొరేటర్లు ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. ఈ నెల 16 నుంచి స్టడీ టూర్ లో ఉన్న విశాఖ నగర పాలక సంస్థ కు చెందిన 95 మంది కార్పొరేటర్లు, కుటుంబ సభ్యులు.. ఇందులో ఉన్నారు. రాత్రి నుంచి రోడ్ పై బస్సుల్లోనే కార్పొరేటర్లు, అధికారులు కాలం గడుపుతున్నారు. అయితే అక్కడికి చేరుకున్న ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. వర్షం పడుతుండడంతో తో రోడ్ క్లియర్ చేసేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదని తెలుస్తోంది.

చండీగఢ్ కు 170 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న కులు మునిసిపాలిటీలోనే పలు ప్రాంతాలను కార్పొరేటర్లు సందర్శించారు. అనంతరం గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు ప్రమాదంలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది.

95 corporators from andhra stuck on ghat road with landslide at kullu manali-chandigarh

కులు మనాలి నుంచి చండీగఢ్ వెళ్తుండగా కొండ చరియలు విరిగిపడి ఘాట్ మధ్యలో వారు ఇరుక్కుపోయారు. కులు మనాలీ-చండీఘడ్ మధ్యలో మింద్ ప్రాంతంలో వీరంతా చిక్కుకున్నట్లు సమాచారం.ఇప్పటివరకు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, కులు మనాలీని కార్పొరేటర్లు సందర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+