విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో.. మెడికల్ షాపులో మద్యం విక్రయం, 7 బాటిళ్లు స్వాధీనం.. ఎక్కడంటే..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. షాపులను తగ్గిస్తూ.. బెల్ట్ షాపులను పూర్తిగా తీసివేసిన సంగతి తెలిసిందే. ఏపీలో ఇదివరకు రాత్రి 8 గంటల వరకు మద్యం విక్రయించేవారు. దానిని 9 గంటల వరకు పెంచినా.. అంతరాష్ట్ర అక్రమ మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపింది. ఇటీవల భారీగా లిక్కర్ బాటిళ్లను రోడ్ రోలర్‌తో తొక్కించారు కూడా. అయితే అక్రమ మద్యం విక్రయాలు మాత్రం రాష్ట్రంలో అక్కడకక్కడ కొనసాగుతూనే ఉన్నాయి.

Recommended Video

AP Sets Up Special Enforcement Bureau To Crack Down On Liquor

మద్యం అక్రమంగా విక్రయించడానికి అనేక దారులు ఎంచుకుంటున్నారు. విశాఖపట్టణం లక్ష్మీపురం కాలనీలో మెడికల్ షాపులో మద్యం విక్రయిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఆర్కే మెడికల్ షాపులో దందా కొనసాగుతోంది. అయితే పోలీసులు పక్క సమాచారంతో దాడులు నిర్వహించారు. మెడికల్ షాపులో 7 మద్యం బాటిళ్లు పట్టుబట్టాయి.

liquor sale in medical shop in vizag..

మద్యం విక్రయించినా నూకరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెడికల్ షాపులో లిక్కర్ విక్రయాలను అని తెలిసి కాలనీ వాసులు ముక్కున వేలేసుకున్నారు. ఇదేం చోద్యం రా బాబు అంటూ ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడే కాదు గతంలో కూడా మద్యం విక్రయాలు జరిగాయి. లాక్ డౌన్ సమయంలో కొన్నిచోట్ల లిక్కర్ విక్రయించిన సంగతి తెలిసిందే.

English summary
liquor sold in medical shop in vizag laxmipuram colony. police seize 7 bottles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X