సృజన సూసైడ్ చేసుకోలే.. ఇష్టపూర్వకంగానే పెళ్లి: సోదరుడు విజయ్
విశాఖలో నవ వధువు మృతి కలకలం రేపింది. సృహ తప్పి పడిపోయి చనిపోయింది. వెంటనే గుండెపోటు.. అలసిపోయిందనే విషయం బయటకు వచ్చింది. తర్వాత డేట్ రాకుండా ఉండేందుకు ట్యాబ్లెట్ వేసుకుందని తెలిసింది. తర్వాత ఆమె హ్యాండ్ బ్యాగ్‌లో గన్నేరు పప్పు లభించిందని తెలిసింది. దీనిపై పూటకో అప్ డేట్ వస్తోంది. దీంతో ఆమె సోదరుడు విజయ్.. ఏం జరిగిందో వివరించాడు.

సృజన సూసైడ్..
సృజన సూసైడ్ చేసుకుందని ప్రచారం కూడా జరిగింది. ఈ కామెంట్లను విజయ్ ఖండించారు. ఆమెకు ఇష్టపూర్వకంగానే పెళ్లి సంబంధం కుదిర్చామని చెప్పారు. డేట్ రాకుండా ఉండేందుకు ట్యాబ్లెట్స్ వేసుకుందని తెలిపారు. అందువల్లే ఇబ్బందికి గురయ్యిందని వివరించారు. ఆమె చనిపోవడంతో విషాదంలో ఉన్నామని.. ఏం జరిగిందో తెలియడం లేదన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే తప్ప ఏమీ చెప్పలేమని తెలిపారు.

చందానగరే..
సృజన స్వస్థలం రంగారెడ్డి జిల్లా చందానగర్.. ఆమె మృతదేహాన్ని చందానగర్ తరలిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత డెడ్ బాడీ కుటుంబ సభ్యులకు అప్పగించారు. వధువు మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ అంతా విషాదంలో మునిగిపోయారు.

పాయిజనే..
హైదరాబాద్‌కు చెందిన ఈశ్వరరావు, అనురాధ దంపతుల కూతురు సృజన.. విశాఖ పీఎం పాలెంకు చెందిన నాగోతి అప్పలరాజు, లలిత కుమారుడు శివాజీతో పెళ్లి కుదిరింది. బుధవారం పెళ్లి తంతు జరుగుతుండగా.. వధువు కుప్పకూలింది. వరుడు జీలకర్ర బెల్లం పెట్టగా సృజన పడిపోయింది. దీంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.వధువు విషం వల్లె చనిపోయి ఉంటుందని వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చరు. వధువు హ్యాండ్ బ్యాగ్‌లో గన్నేరు పొట్లం గుర్తించారు.

కుప్పకూలిన సృజన
విశాఖ మధురవాడలో బుధవారం రాత్రి 7 గంటలకు తెలుగు యువత అధ్యక్షుడు శివాజీ-సృజన పెళ్లి జరగాల్సి ఉంది. ముహూర్తం సమయానికే అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇంకేముంది అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వరుడు.. వధువు ఇద్దరూ పెళ్లి పీటలెక్కారు. కల్యాణం తంతు జరుగుతుంది. కీలక ఘట్టం అయిన జీలకర్ర బెల్లం ప్రక్రియ మొదలవనుంది. వధువు తలపై జీలకర్ర బెల్లం పెడుతుండగా సృహ కోల్పోయింది. పీటలపైనుంచి కింద పడిపోవడంతో అంతా కంగారు పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆమె చనిపోయింది.












Click it and Unblock the Notifications