విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓకే వీధి.. జిల్లా వేరు.. నియోజకవర్గం, మండలాలు కూడా.. ఏపీలో ఎక్కడంటే...?

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు అమల్లోకి వచ్చాయి. ఒక్కో లోక్ సభ నియోజకవర్గం పరిధిని జిల్లాగా చేశారు. అయితే జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల విస్తరణ, మండలాలు చేయడం.. అభివృద్ది కోసమే.. అలాగే ప్రజలకు ఇబ్బంది కలుగకూడదు. కానీ ఏపీలో మాత్రం ఇందుకు విరుద్దంగా ఉంది. అంటే అన్ని జిల్లాలకు సంబంధించి మాత్రం కాదు.. ఒక జిల్లాలో ప్రజల పరిస్థితి విచిత్రంగా ఉంది. అదేంటో చూద్దాం పదండి.

ఒకే వీధి.. కానీ

ఒకే వీధి.. కానీ

ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి వచ్చిన కొత్త జిల్లాల్లో పలు వింత ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఒకే వీధి ఇప్పుడు రెండు నియోజకవర్గాలు, రెండు మండలాలు, రెండు జిల్లాలకు సరిహద్దుగా మారింది. జిల్లాల పునర్విభజన వల్ల కొవ్వూరు నియోజక వర్గం తాళ్లపూడి మండలం తాడిపూడి, పోలవరం నియోజక వర్గం గూటాల పంచాయతీ పరిధిలో గల మహాలక్ష్మీదేవిపేట గ్రామం వేర్వేరు జిల్లాల పరిధిలోకి వెళ్లిపోయాయి. ఇదీ మాత్రం విచిత్రంగా మారింది. ఇదివరకు ఏ సమస్య లేకుండే.. జిల్లాల ఏర్పాటు ఆ ప్రాంతంలో ప్రాబ్లమ్ క్రియేట్ చేసింది.

తూ.గో జిల్లా.. ఏలూరు జిల్లా

తూ.గో జిల్లా.. ఏలూరు జిల్లా

తాడిపూడిలోని ఓ వీధి కుడివైపు భాగం తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్లగా, ఎడమవైపున ఉన్న మహాలక్ష్మీదేవిపేట ఏలూరు జిల్లాలోకి వెళ్లింది. ఫలితంగా ఒకే వీధి ప్రజలు రెండు వేర్వేరు జిల్లాలు, వేర్వేరు మండలాలు, వేర్వేరు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదీ మాత్రం విచిత్రమే.. అవును ఒక వీధిలో రెండు భాగాలు మండలాలు, నియోజకవర్గాలు.. జిల్లాల పరిధిలోకి రావడం ఏంటీ.. ప్రజల సౌలభ్యం కోసం జిల్లాలను తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతుంది. మరీ ఆ వీధి వారికి ప్రభుత్వ పెద్దలు ఏం సమాధానం చెబుతారో చూడాలీ మరీ.

సమస్య ఎవరికీ చెప్పాలి

సమస్య ఎవరికీ చెప్పాలి

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. ప్రతీ లోక్ సభ నియోజకవర్గానికి ఒక జిల్లా ఏర్పాటు చేశారు. కలెక్టర్లు, ఎస్పీలను కూడా నియమించారు. దీనిపై విపక్షాల విమర్శిస్తున్నారు. వారికి బలం చేకూరేలా ఈ ఘటన ఉంది. ఆ వీధి ప్రజలు కలిసి మెలసి ఉండేవారు. ఇప్పుడు సంఘాలు, కుల సంఘాల భవనాల సంగతి ఏంటీ అనే చర్చ జరిగింది. ఎందుకంటే మా నియోజకవర్గం కాదంటే మాదీ కాదని నేతలు అనే అవకాశం ఉంటుంది. సో.. ఆ వీధి ప్రజల పరిస్థితి మాత్రం వర్ణణాతీతంగా మారింది.

English summary
same colony but district, constituency and mandal name are change. andhra pradesh tadipudi has name change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X