టీడీపీ మాజీ మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు- నర్సీపట్నంలో వ్యక్తి అరెస్ట్
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడితో పాటు మరికొందరు నేతలను చంపేస్తానంటూ బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు చేస్తున్న ఓ వ్యక్తిని విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు ఱరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం అగ్రహారం గ్రామానికి చెందిన తాతారావుగా అతన్ని గుర్తించారు.
పోలీసుల దర్యాప్తులో తాతారావు బీటెక్ పూర్తి చేసి ప్రముఖ నేతలకు ఫోన్ బెదిరింపులు, మెసేజ్‌లు పంపుతున్నట్లు గుర్తించారు. దీని వెనుక కారణాలను ఆరా తీస్తున్నారు. తాతారావు ఇప్పటికే టీడీపీకి చెందిన మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుతో పాటు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ రేవంత్‌రెడ్డిని కూడా బెదిరించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను బెదిరించిన కేసులో పోలీసులు గతంలో సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఇతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చి ఇతర నేతలను బెదిరించినట్లు పోలీసులు చెబుతున్నారు.

తాతారావు విచారణలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని తాజాగా గత నెల రెండోవారంలో బెదిరించినట్లు అంగీకరించాడు. ఈ మేరకు మాజీ మంత్రికి బెదిరింపు మెసేజ్‌లు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. అయ్యన్నపాత్రుడిని చంపే ప్రయత్నం జరుగుతోందని తనకు సమాచారం ఉందని తాతారావు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. తాజాగా అతడి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా మరోసారి అరెస్టు చేసినట్లు విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు తెలిపారు.
-
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications