నేలపై ప్రసాదం-మోకాళ్లపై కూర్చొని నాలుకతో స్వీకరిస్తారు-వర్షాలు కురిసేందుకు గిరిజనుల వింత ఆచారం
వర్షాలు కురవాలని కప్ప తల్లి ఆటలు ఆడటం... వరుణ దేవుడికి యాగాలు చేయడం చూసే ఉంటాం. విజయనగరం జిల్లాలోని గిరిజన,ఆదివాసీ తెగలకు ఇందుకు భిన్నమైన ఆచార,సాంప్రదాయాలు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు వర్షాలు కురవాలని జాకరమ్మ,భైరవ దేవుళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కోళ్లు,మేకలు బలి ఇస్తారు. పాయసం వండి నైవేద్యం పెడుతారు. దేవతా విగ్రహాలు నెలవైన ఆ కొండపై ప్రసాదాన్ని పెట్టి... మోకాళ్లపై కూర్చొని... కిందకు వంగి నాలుకతో ప్రసాదాన్ని స్వీకరిస్తారు.
విజయనగరం జిల్లాలోని సాలూరు ఏజెన్సీలో ఉన్న కూర్మరాజు పేటలో గత 60 ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది. ఈసారి వరి నాట్లు వేసి చాలా రోజులవుతున్నా వానలు జాడ లేకపోవడంతో దేవుళ్లకు పూజలు జరపాలని నిర్ణయించారు. అనుకున్నట్లుగానే అంతా కలిసి సమీపంలోని కొండపై నెలవైన జాకరమ్మ,కొడ భైరవ దేవుళ్ల వద్దకు డప్పుల మోతతో ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం అక్కడే స్నానాలు ఆచరించి దేవుళ్లకు పూజలు నిర్వహించారు. వెంట తీసుకెళ్లిన బియ్యం,బెల్లంలతో కలిపి పాయసం వండి నైవేద్యం పెట్టారు. కోళ్లు,మేకలను బలి ఇచ్చారు.

నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని వంతుల వారీగా కొండపై వేసి... మోకాళ్లపై కూర్చొని కిందకు వంగి.. దాన్ని నాలుకతో స్వీకరించారు.అలా ఒక్కొక్కరు ఇదే పద్దతిలో ప్రసాదాన్ని స్వీకరించారు. ఇలా చేస్తే దేవుళ్ల అనుగ్రహం కలిగి వర్షాలు కురుస్తాయని వారు విశ్వసిస్తారు. ప్రతీ ఏటా ఈ ప్రాంతంలో వందల ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తుంటారు. ఈ ఏడాది కూడా భారీగానే వరి నాట్లు పడ్డాయి. అయితే వర్షాలు లేకపోవడంతో రైతులు ఢీలా పడ్డారు. తమ ఆచారం ప్రకారం నిర్వహించిన పూజలతో వర్షాలు కురుస్తాయని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.
సాధారణంగా గ్రామాల్లో సకాలంలో వర్షాలు కురవకపోతే గ్రామస్తులు కప్ప తల్లి ఆట ఆడుతారు. ఇందుకోసం కప్పలను ఒక గుడ్డలో కర్రకు కడుతారు. స్థానిక గ్రామ దేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి... అక్కడి నుంచి డప్పు,దరువులతో,ఆట పాటలతో ఇంటింటికి తిరుగుతారు. బిందెలతో తీసుకొచ్చిన నీళ్లను ఆ కప్పలపై కుమ్మరిస్తారు. కొన్నిచోట్ల కుప్పలకు పెళ్లిళ్లు కూడా చేస్తారు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఈ ఆచారం కొనసాగుతోంది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications