5 ఇన్‌స్పెక్టర్ల ఫారిన్ టూర్, గోవాలో కూడా జల్సాలు.. వారికి స్పాన్సర్ చేసిందేవరంటే..
వరంగల్‌కు చెందిన ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు విదేశాల్లో ఎంజాయ్ చేశారు. వారు మాములుగా గడపడం లేదు. పారిశ్రామిక వేత్తలు.. ఆగర్భ శ్రీమంతుల మాదిరిగా జాలీగా ఉంటున్నారు. అయితే వీరు ఈ స్థాయిలో ఖర్చు చేసి.. జల్సా చేయడానికి కారణం ఏమై ఉంటుందని ఆరా తీస్తే.. వారు ఇన్విటేషన్‌తో వచ్చారని తెలిసింది. అవును వరంగల్ కమిషనరేట్ పరిధిలో లిక్కర్ డాన్‌గా వెలుగొంతుతున్న ఓ వ్యక్తి వల్లే వారు ఫారిన్ ట్రిప్ తెగ ఎంజాయ్ చేశారు. లిక్కర్ డాన్ కుమారుడి ఖర్చుతో విదేశాల్లో జల్సాలు చేశారు.

ఫారిన్ కాదు.. ఇక్కడ కూడా
ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని హాలిడే స్పాట్లు, గోవా వంటి పర్యాటక ప్రదేశాల్లో కూడా షికార్లు కొట్టారట. విషయం ఆ నోటా.. ఈ నోటా.. ఉన్నతాధికారులకు చేరింది. ఇంకేముంది విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఇంటెలిజెన్స్, స్పెషల్‌బ్రాంచ్ పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో ఇదీ నిజమేనని తేలింది. ఆ ఐదుగురు ఇన్‌స్పెక్టర్లకు చార్జ్‌మెమోలు జారీ చేశారు. శుక్రవారం సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన ఉన్న నేపథ్యంలో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు ఆ బిజీలో ఉండి, చార్జ్‌మెమోలు తీసుకోలేదని తెలిసింది. మిగతా ఇద్దరికి మెమోలు అందాయి.

3 నెలల క్రితం టూర్.. కానీ
లిక్కర్ డాన్ కుమారుడు ఈ ఐదుగురు ఇన్‌స్పెక్టర్లకు మూడు నెలల క్రితం విదేశీయానం చేయించినట్లు విచారణలో తేలింది. 3 నెలల క్రితం విషయం తెలియగానే ఉన్నతాధికారులు భారీ ఎత్తున బదిలీ చేశారు. పరకాల సబ్-డివిజన్ పరిధికి మరో ఇద్దరు ఖమ్మం, మహబూబాబాద్‌కు, ఒకరు వరంగల్ ఈస్ట్‌కు బదిలీ అయ్యారు. మరో ఇన్‌స్పెక్టర్ వీఆర్‌లో ఉన్నారని తెలుస్తోంది. అంతకుముందు ఐదుగురు ఇన్‌స్పెక్టర్లకు గుడెస్సాడ్ సమీపంలోని ఓ హోటల్‌లో సదరు లిక్కర్ డాన్ కుమారుడు పార్టీ ఇచ్చాడని సమాచారం. వీరంతా వరంగల్‌లో పనిచేసినప్పుడు సదరు లిక్కర్‌డాన్ బార్లు, వైన్‌షాపులు వీరి ఠాణాల పరిధుల్లోకి వచ్చేవి. అలా వారి పరిచయం బలపడింది.

ఎందుకు ట్రిప్ తీసుకెళ్లడంటే
లిక్కర్ డాన్ కుమారుడి ప్రేమ వ్యవహారంపై సెప్టెంబరులో ఓ మట్టేవాడలో కేసు నమోదైంది. ఓ యువతి తనను మోసం చేశాడంటూ అతనిపై కేసు పెట్టింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న లిక్కర్‌డాన్ కుమారుడు.. పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు నెలలుగా అతను పరారీలో ఉన్నా.. మూడు నెలల క్రితం ఇన్‌స్పెక్టర్లను విదేశీ యాత్రలకు తీసుకెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
పూర్తిస్థాయి విచారణలో ఈ ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు తప్పుచేసినట్లు తేలితే.. సస్పెన్షన్ వేటు తప్పదని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో డీఎస్పీ/ఏసీపీ స్థాయి అధికారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. వారిపై అంతర్గత విచారణ సాగుతోంది. లిక్కర్ డాన్ కుమారుడు ప్రేమ వ్యవహారంలో.. 5 ఇన్ స్పెక్టర్లను తెగ జల్సా చేయించారు. కానీ విచారణలో మాత్రం అదీ వారి మెడకు చుట్టుకుంది.












Click it and Unblock the Notifications