video:సీఎం కేసీఆర్ కాన్వాయ్ నుంచి పడిన మహిళా పోలీస్, ఆపని వాహనాలు

సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో అపశృతి జరిగింది. ఆయన కాన్వాయ్ నుంచి ఓ మహిళా కానిస్టేబుల్ పడిపోయారు. అయిన కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాన్వాయ్ ఆపకుండా వెళ్లనివ్వడం విమర్శలకు దారితీస్తోంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

వరంగల్ జిల్లా పర్యటన కోసం ఇవాళ ఉదయం సీఎం కేసీఆర్ వెళ్లారు. హైదరాబాద్ నుంచి బయల్దేరిన కేసీఆర్.. జనగామ జిల్లా పెంబర్తి కళాతోరణం చేరుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్‌కు శాలువ కప్పి స్వాగతం పలికారు. అక్కడ కాన్వాయ్ కదులుతుండగా ఘటన జరిగింది.

a woman cop fell down in the cm kcr convoy

ఓ మహిళా కానిస్టేబుల్ పడిపోయారు. ఆమె చేతిలో శాలువా కూడా ఉంది. లేడీ కాప్ పడిపోయిన కాన్వాయ్ ఆగలేదు. అలాగే ముందుకు వెళ్లనిచ్చారు. అక్కడే ఉన్న ఇతర పోలీసులు వెంటనే స్పందించారు. స్వల్పంగా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆ వీడియోలో మాత్రం సదరు కానిస్టేబుల్ పరుగు తీయడం కనిపిస్తోంది.

హన్మకొండ జిల్లాలో గల దామెర క్రాస్ రోడ్, నేషనల్ హైవే 163లో ప్రతిమ రిలీఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ప్రతిమ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. కానీ ఇంతలోనే ఇలా ప్రమాదం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+