నమ్మించాడు, గర్భవతిని చేశాడు.. వరంగల్ జిల్లాలో ప్రేమికురాలి ధర్నా

వరంగల్‌ : ప్రేమించానని వెంటబడ్డాడు. నువ్వే సర్వస్వం అంటూ నమ్మించాడు. నీ ప్రేమ కావాలంటూ ఒప్పుకునే వరకు వదిలిపెట్టలేదు. అతడి తీరు చూసి ఆమె కూడా ప్రేమకు ఓకే చెప్పింది. అలా ఆ ఇద్దరూ ప్రేమికులు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అంతవరకు బాగానే ఉంది.. సీన్ కట్ చేస్తే పెళ్లి విషయం వచ్చేసరికి చేతులేత్తేశాడు.

వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామానికి చెందిన సద్దాం అనే యువకుడు.. అదే గ్రామానికి చెందిన అప్సర అనే యువతిని ప్రేమించాడు. అయితే కొన్నాళ్లపాటు సాగిన వీరి ప్రేమాయణానికి బ్రేక్ పడింది. మాయమాటలు చెప్పి తనను శారీరకంగా వాడుకున్నాడనేది బాధితురాలి ఆరోపణ. తీరా తాను గర్భం దాల్చాక.. తనకు సంబంధం లేదంటూ తప్పించుకుంటున్నాడని వాపోతోంది.

woman protest at lovers house in warangal district

తనను వంచించి గర్భవతిని చేసిన సద్దాం.. ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఆ యువతి అతడి ఇంటి ఎదుట నిరసనకు దిగింది. ఆమెకు బాసటగా ఎమ్మార్పీఎస్ నాయకులతో పాటు స్థానిక సర్పంచ్ యశోద తదితరులు మద్దతుగా నిలబడ్డారు. అయినా కూడా సద్ధాం ఎవరి మాట వినడం లేదని తెలుస్తోంది.

అదలావుంటే సద్దాం వాదన మరోలా ఉంది. ఆ యువతిని ఇష్టపడ్డానని.. పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తనతో చెప్పానని అంటున్నాడు. అయితే అప్సర ఇతరుల మాట విని లేనిపోని అపార్థాలతో తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని వాదిస్తున్నాడు. అయితే ఆమెకు నావల్లే గర్భం వచ్చిందంటే.. ఏ శిక్ష వేసినా సిద్ధమేనంటున్నాడు. డీఎన్ఏ టెస్టుకు తాను రెడీగా ఉన్నట్లు చెప్పాడు. చివరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పడంతో యువతి ఆందోళన విరమించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+