పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

150 వంటకాలు: మొన్న కోడలు.. నేడు మామ, బర్త్ డేకు సర్ ప్రైజ్ గిప్ట్

|
Google Oneindia TeluguNews

ఇటీవల అత్త బర్త్ డేకు కోడలు విషెస్ చెప్పడం చుశాం. అదేనండి 60వ బర్త్ డే సందర్భంగా 60 వంటకాలు.. ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. అత్త- మామల టర్న్ వచ్చింది. అదే గోదావరి జిల్లాలో మామ కూడా కోడలును సర్ ప్రైజ్ చేశారు. ఆమె బర్త్ డే సందర్భంగా 150 వంటకాలు చేశారు. ఇప్పుడు అత్త-మామ కూడా వార్తల్లోకి వచ్చారు. కోడలు అంటే తమ కూతురు అని చేతల ద్వారా చూపించారు. ఆమె పుట్టినరోజును కూడా ఘనంగా జరుపుకున్నారు. ఆ వివరాలు ఏంటో ఒకసారి చుద్దాం పదండి.

150 వంటకాలు

150 వంటకాలు


భీమవరానికి చెందిన తుంపూడి వెంకటకృష్ణ.. 150 వంటకాలు ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాలు అంటే మర్యాద అని మరోసారి ప్రూవ్ చేశారు. కోడలు తేజస్విని పుట్టినరోజు సందర్భంగా శనివారం వంటకాలు చేయించారు. 14 రకాలు రైస్ ఐటెమ్స్ కాగా.. 35 రకాల స్వీట్లు ఉన్నాయి. 35 రకాల హాట్ కూడా ఉంది. చిన్న పెద్ద ఇష్టపడే 20 రకాల చాక్లెట్లు.. 20 రకాల కేకులు కూడా ఏర్పాటు చేశారు. ఆ వంటకాలతో టేబుల్ నిండిపోయింది. కలర్ పులే కాదు.. మంచి టేస్టీ ఉందని బంధువులు అంటున్నారు.

కోడలు గిప్ట్.. మామ బహుమతి

కోడలు గిప్ట్.. మామ బహుమతి


ఇదివరకు అత్తకు కోడలు గిప్ట్ ఇవ్వగా.. ఇప్పుడు మరో కుటుంబం ఇలాంటి మంచి పని చేసింది. కోడలు బర్త్ డే సందర్భంగా జీవితాంతం గుర్తుండే పనిచేసింది. 150 రకాల వంటకాలు చేసి.. ఔరా అనిపించింది. ఇదీ కోడలు అంటే తమ కూతురు అని.. సనాతన హిందు సంప్రదాయాన్ని తెలియజేసింది. మామ-అత్తను పలువురు నెటిజన్లు కొనియాడుతున్నారు. వావ్ అంటూ కీర్తిస్తున్నారు.

ఆషాడం సారె

ఆషాడం సారె


ఇటీవల ఏపీలో ఓ తండ్రి కూతురు ఇంటికి ఆషాడం సారె పంపించి అబ్బురపరిచారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కోడలు అలాంటి మంచి పనిచేసింది. తర్వాత మామ కూడా మంచి పనిచేశారు. ఇక కోడలు గురించి ప్రస్తావిస్తే.. తన అత్త 60వ పుట్టినరోజు కలకలం గుర్తుండేలా చేశారు. పుట్టినరోజు అంటే ఏదో దద్దొజనం.. లేదంటే బిర్యానీ చేసి చేతులు దులుపుకోలేదు. ఒకటి కాదు రెండు కాదు 60 రకాల వంటకాలు చేసిపెట్టింది.

వావ్.. కోడలు

వావ్.. కోడలు

ఒకటి రెండు వంటకాలు చేయడం మహాకష్టం. అదీ కూడా అత్తకు చేయడం అంతా వీజీ కాదు. కానీ ఆమె 60 వంటకాలు చేసింది. అవున పులిహోర, బిర్యానీ, కర్డ్ రైస్, చల్లట్లు, అలు పరోటా, కొత్తిమీర చపాతీ, టొమాటో రైస్, సేమియా ఉప్మా, గారెలు, బంగాళదుంప బొండలు, ఇడ్లీ, అరటికాయ బజ్జీ, చల్ల పంగడలు, బ్రెడ్ శాండ్ విచ్ అలా 60 వంటకాలు చేశారు. ఆమె చేసిన వంటకాలు చూసి.. నోరూ ఊరుతుంది. స్వీట్, హాట్ కలిపి.. అత్తపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు.

నిజంగా లక్కీయే..

నిజంగా లక్కీయే..


ఆ అత్త నిజంగా అదృష్టవంతురాలు. ఎందుకంటే తన పుట్టినరోజు సందర్భంగా కోడలు ఇచ్చిన బహుమతి మాములు కాదు. తినుబండారాలతో చేసి పెట్టిన ఐటెమ్స్ ప్రతీ ఒక్కరు మరవలేరు. లక్షలు, కోట్ల రూపాయల కన్నా కూడా ప్రత్యేకం. ఇష్టపడి చేసిన ఫుడ్ ఐటెమ్స్ ప్రతీ ఒక్కరీ మదిని దోస్తుంది. అవీ చేయడానికి ఎంత సమయం పట్టిందో తెలియదు.. కానీ అత్తపై తనకు ఉన్న మమకారాన్ని మాత్రం చాటుకున్నారు.

నలుగురికి ఆదర్శం

నలుగురికి ఆదర్శం

కోడలు అంటే ఇలా ఉండాలి.. అత్త అంటే అలా మెలగాలి అని అందరూ అంటున్నారు. వీడియో పోస్ట్ చేయగా.. నెట్టింట వైరల్ అయ్యింది. వావ్ అత్త కోడళ్లు అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మీరిద్దరూ మిగతావారికి ఆదర్శంగా నిలిచారని కామెంట్ చేస్తున్నారు. నిజానికి వీరిద్దరీ స్నేహం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం ప్రతీ ఒక్కరికీ వస్తే ఆ సమాజమే వసుదైక కుటుంబం అవుతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు మామ వంతు వచ్చింది. కోడలు చేయంగా.. తాము ఏం తక్కువ తిన్నామా అనుకున్నారు. వారు 60 వంటకాలు పెడితే.. ఏకంగా 150 వెరైటీలు చేయించారు. మిగతా మామలకు ఆదర్శంగా నిలిచారు.

Recommended Video

Eta Variant In India ఇప్పటికే పలు వేరియంట్లు | Kerala | COVID 19 Vaccination || Oneindia Telugu
వేరుగా ఉండటమో.. ఇతర చోట్ల నివాసం

వేరుగా ఉండటమో.. ఇతర చోట్ల నివాసం


సాధారణంగా అత్త, మామలతో కొడుకులు/ కోడళ్లు సరిగా ఉండరు. పెళ్లయిన వెంటనే వేరు పడిపోవడమో.. లేదంటే ఇతర చోట ఉండటమో చేస్తారు. ఉమ్మడి కుటుంబాలు అనే మాటను మరచిపోయి చాలా రోజులు అవుతుంది. అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలు ఏర్పడ్డాయి. సిటీలోనో.. టౌన్‌లోనే ఉంటున్నారు. పేరంట్స్‌ను పట్టించుకునే నాథుడే లేడు. సిటీ నుంచి కొందరు రావొచ్చు.. కానీ అమెరికా/ ఆస్ట్రేలియాలో ఉన్నవారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చచ్చినా వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఊరిలో ఉన్న ముసలి ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నాయి. కానీ వారు సంపాదనలో పడిపోయారు. తమకు పేరంట్స్ వద్దనుకుంటున్నారు. కానీ రేపు వారి పరిస్థితి కూడా అదేనని విషయం మరచిపోతున్నారు. వర్తమానంలో జీవిస్తూ.. క్షణిక ఆనందం పొందుతున్నారు. రేపు తమ సిచుయేషన్ గురించి ఆలోచించడం లేదు. దీనికి సంబంధించి మూవీలో ఎన్ని చూపించినా.. మార్పు మాత్రం రావడం లేదు. డబ్బు సంపాదనకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

English summary
father in law special gift to her daughter in law birthday. he prepares 150 variety food items. incident happen at west godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X