Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘మొదటి భర్తతో విడాకులు.. ప్రేమ పేరుతో ఆ హీరో వాడుకుని'

మూడు గంటల పాటు మనకి వినోదం పంచేందుకు నటీనటులు ఎంతో శ్రమిస్తారు. కానీ వారి వ్యక్తిగత జీవితాలు మాత్రం దారుణంగా ఉంటాయి. అయినప్పటికీ వారి బాధలను పంటి బిగువున భరిస్తూ కెమెరా ముందుకు రాగానే యాక్టింగ్ మోడ్‌లోకి వచ్చేస్తారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్న నటీనటులు ఉన్నారు. వీరిలో అగ్రనటులు, స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు ఇంటర్వ్యూల ద్వారా తమ కష్టాలు, కన్నీటిగాథలను పంచుకుంటున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..

ఆ పిల్ల నాది... ఈ కట్టె కాలేంత వరకు నీతోనే... స్టార్ కొరియోగ్రాఫర్ ఎమోషనల్

మమతా మోహన్‌దాస్. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. నటిగా, నిర్మాతగా, సింగర్‌గా తన సత్తాను చాటుకున్నారు. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ.. మలయాళీ తల్లిదండ్రులకు బహ్రెయిన్‌లో పుట్టారు. చిన్నప్పటి నుంచి నటన, సంగీతం పట్ల ఆసక్తి ఉండటంతో కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతాన్ని నేర్చుకున్నారు. మోడల్‌గానూ పలు టాప్ బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించారు మమతా మోహన్‌దాస్. 2005లో మయూఖం అనే మలయాళ చిత్రం ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు. చిన్న వయసులోనే మమ్ముట్టి, సురేష్ గోపీ, జయరాం, మోహన్‌లాల్ వంటి టాప్ స్టార్స్‌తో నటించే అవకాశం దక్కించుకున్నారు మమత. ఆ తర్వాత కొన్ని తమిళ చిత్రాల్లో నటించారు.


Mamta Mohandas Opens Up About Cancer Battle Divorce and Heartbreak in Emotional Podcast Interview

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ మూవీ ద్వారా తెలుగువారిని పలకరించారు మమతా మోహన్‌దాస్. తర్వాత కింగ్, కృష్ణార్జున, హోమం, కేడీ తదితర సినిమాలతో టాలీవుడ్‌లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత తమిళ్, మలయాళ చిత్రాల్లోనే నటించింది. దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసింది. నిర్మాతగా కొన్ని చిత్రాలలో నటించడంతో పాటు సింగర్‌గానూ రాణించింది. తొలుత తన చిన్ననాటి మిత్రుడు ప్రజిత్‌ను 2011లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మమత. అయితే వీరిద్దరి మధ్య వివాదాలు తలెత్తడంతో కొద్దిరోజులకే విడిపోయారు.

Seetha Payanam Day 2 Collections: షాకింగ్‌గా సీతా పయనం కలెక్షన్స్.. రెండో రోజు అర్జున్ సర్జా మూవీకి ఎంతంటే?

2009లో క్యాన్సర్ బారినపడ్డ మమతా మోహన్‌దాస్.. ధైర్యంగా ఈ మహమ్మారిపై పోరాటం చేసి విజయం సాధించారు. క్యాన్సర్‌పై గెలిచిన తర్వాత అనేక దుష్ప్రభావాలను ఆమె ఎదుర్కొన్నారు. ఈ కాలంలో బొల్లి వ్యాధి సోకడంతో మానసికంగా నలిగిపోయారు. అయినప్పటికీ విధి పెట్టిన పరీక్షలను ఎదురొడ్డి నిలిచి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు మమతా మోహన్‌దాస్. తాజాగా సీనియర్ నటి సుహాసినీ హోస్ట్‌గా నిర్వహిస్తోన్న సెకండ్ సన్‌రైజెస్ బై జోస్ ఆలుక్కాస్ పాడ్‌కాస్ట్‌కు హాజరైన మమతా మోహన్‌దాస్ తన కెరీర్‌, రిలేషన్, విడాకుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

మలయాళ పరిశ్రమకు చెందిన ఓ నటుడు నన్ను డేటింగ్‌కు ఆహ్వానించాడు. కుటుంబ సభ్యులకు అతనిని పరిచయం చేసి వారి అంగీకారం మేరకు అతనితో రిలేషన్ కొనసాగించాను. అయితే ఆ నటుడు ఓ నెల తర్వాత డేటింగ్ నుంచి బయటకు బయటకు వచ్చేయమని అడిగాడు. అప్పుడే అతని సోదరుడి ద్వారా ఒక విషయం తెలిసింది. ఆ నటుడికి అప్పటికే ఓ అమ్మాయితో నిశ్చితార్ధం జరిగింది. ఈ విషయం తెలియగానే మా అమ్మకి చెప్పగా.. వెంటనే రిలేషన్‌కి బ్రేకప్ చెప్పమని అంది. ఈ ఘటనతో గుండె పగిలిపోయినంత పని అయ్యిందని మమత ఆవేదన వ్యక్తం చేశారు.

Manasantha Nuvve Re Release Collections: మనసంతా నువ్వే రీ రిలీజ్‌కు భారీ కలెక్షన్లు.. ఉదయ్ కిరణ్ మూవీకి క్రేజ్

తర్వాత నాకు మరో వ్యక్తి కలిశాడు. మెసేజ్, కాల్.. తర్వాత అతను కూడా వదిలేశాడు. అతను నాలుగైదు రోజుల తర్వాత నలుగురికి కాల్ చేసేవాడు. దాంతో అతనితో నాకు సెట్ కాదని అనిపించింది. తొలుత నేను నా మాజీ భర్త ప్రజిత్‌ను అతని సోదరి పెళ్లిలో కలిశాను. అతను బహ్రెయిన్‌కు చెందిన వాడు కావడంతో చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. దాదాపు 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రజిత్‌ను చివరిసారిగా కలవడంతో పెళ్లి సమయంలో థ్రిల్ అనిపించింది. అతను నా కంటే రెండు రోజులు చిన్నవాడు. అయినప్పటికీ ప్రజిత్ నాకు కనెక్ట్ అయ్యాడు. అతని సోదరి పెళ్లి అవ్వగానే మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. నేను వెంటనే నాన్నతో మాట్లాడమని చెప్పానని.. అటు నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ రావడంతో పెళ్లి జరిగిపోయిందని మమతా మోహన్‌దాస్ గుర్తుచేసుకున్నారు.

శ్రీముఖి కౌగిలిలో ఆ నటుడు... నీతో తనివి తీరదంటూ రాములమ్మ బోల్డ్ కామెంట్స్

నేను పెళ్లిని జీవితాంతం నిబద్ధతగా నిర్వహించాలని అనుకున్నాడు. కానీ 6 నెలల తర్వాత నేను ఆ బంధానికి దూరం కావాల్సి వచ్చింది. ఇది అంత తేలికైన నిర్ణయం కాదు. పెళ్లి చేసుకోవాలని అనుకున్న సమయంలోనే నేను క్యాన్సర్‌తో పోరాడుతున్నా. నా జీవితంపై మా అమ్మ అప్పటికే భయాందోళనకు గురవుతోంది. అప్పుడే నాకు ఒక మంచి తోడు కావాలని నిర్ణయించుకున్నాను. కానీ పెళ్లికి రెండు వైపులా బలమైన ప్రయత్నం అవసరం. అయితే నా దృష్టిలో బంధాలను పదే పదే కోరుకోవడం హానికరమని మమతా మోహన్‌దాస్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Credit: Filmibeat

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+