Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ యంగ్ హీరోకి బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్... ఇంటికి పిలిపించి మరి..

అన్న నందమూరి తారక రామారావు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన కుమారుడు బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్. 65 ఏళ్ల వయసులోనూ కష్టపడుతూ కుర్రాళ్లతో సమానంగా సినిమాలు చేస్తున్నారు బాలయ్య. సినీనటుడిగానే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు. అటు ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా నందమూరి బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతున్నారు. కొన్ని కారణాలతో బాబాయ్ - అబ్బాయ్ మధ్య ఇటీవలి కాలంలో గ్యాప్ పెరిగిందని ఫిలింనగర్ టాక్. అయినప్పటికీ ఎవరి బాటలో వాళ్లు నందమూరి కుటుంబం కోసం శ్రమిస్తూనే ఉన్నారు. అలాంటిది వీరిద్దరూ ఓ యంగ్ హీరోకి వార్నింగ్ ఇచ్చారట. ఈ విషయాన్ని సదరు హీరోనే స్వయంగా బయటపెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే...

Euphoria Day 2 Collections: దారుణంగా యుఫోరియా కలెక్షన్స్... గుణశేఖర్ మూవీకి భారీ దెబ్బ

బాలయ్య, ఎన్టీఆర్‌లతో అనుబంధం
ఆ హీరో ఎవరో కాదు.. మాస్ కా దాస్ విశ్వక్‌సేన్. నందమూరి హీరోలు బాలయ్య, ఎన్టీఆర్‌లతో ఈ కుర్రాడికి మంచి అనుబంధం ఉంది. తన సినిమాలకు చీఫ్ గెస్ట్‌గా కూడా వీరిద్దరూ హాజరయ్యారు. విశ్వక్ కూడా తన అభిమాన నటులతో అనుబంధాన్ని అలాగే మెయింటైన్ చేస్తున్నారు. సినిమాల విషయంలోనూ ఎన్టీఆర్, బాలకృష్ణ తనకు కొన్ని సలహాలు సూచనలు ఇస్తారని ఎన్నోసార్లు విశ్వక్ తెలిపారు. తాజాగా ఆయన తాజాగా నటిస్తోన్న చిత్రం ఫంకీ. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13వ తేదీన ఫంకీ రిలీజ్ కానుంది.


Nandamuri Balakrishna and Jr NTR Warn Vishwak Sen After Laila Flop Actor Opens Up in Funky Promotions

అనుదీప్ దర్శకత్వంలో ఫంకీ
ఈ చిత్రంలో కాయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీకే నరేష్, వీటీవీ గణేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా, సురేష్ సారంగం సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో విశ్వక్‌సేన్, హీరోయిన్ కాయదు లోహర్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్వక్‌సేన్‌ను ఆయన గత చిత్రం లైలా రిజల్ట్ గురించి ప్రశ్నించారు యాంకర్. దీనికి హీరో స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నీ కూతురిని బెడ్‌రూంకి పంపిస్తావా... అమ్మకి డైరెక్టర్ వేధింపులు.. హీరోయిన్ సంచలనం

ఫ్లాప్ కొట్టి సెలబ్రేషన్స్
లైలా సినిమా రిలీజ్ అయిన సమయంలో బాంబేలో మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఉన్నాను. మూడు రోజులు డ్యాన్స్ వేసుకుంటూ కూర్చొన్నా. సినిమాల రివ్యూలు చదివేంత ఓపిక కూడా లేదు. అన్ని పైపైన చూసి కొన్ని హైలైట్స్ ఏమైనా ఉంటే గుర్తుంచుకునే వాడినే. ఈ సినిమాతో గుణపాఠం నేర్చుకున్నా.. కాకపోతే ముంబైలో మ్యూజిక్ ఫెస్టివల్ అయిపోయి హైదరాబాద్ వచ్చిన తర్వాత సినిమా పోయిందని గుర్తొచ్చింది. ఫస్ట్ డే నాకు రిజల్ట్ అర్ధమైపోయింది. మీ అందరి రివ్యూలు చదవకముందే నాకే అర్ధమైపోయింది. మా అమ్మ ఫేస్‌లో కూడా అర్దమైపోయింది.. ఎందుకంటే ఎంత బాలేని సినిమా అయినాసరే అదరగొట్టావని చెట్టు ఎక్కిస్తుంది. అలాంటిది ఆవిడకి కూడా నోరు రాలేదు. వెంటనే యాక్సెప్ట్ చేసేశా.. నన్ను ఓదారుద్దామని వస్తున్నవాళ్లకి నేనేం చేస్తున్నానో అర్ధం కాలేదు. సెన్షేనల్ ఫ్లాప్ కొట్టామని నేనే ఎదురెళ్లి హగ్ చేసుకున్నా అని విశ్వక్‌సేన్ తెలిపారు.

The Rajasaab OTT: ప్రభాస్ అభిమానులకు షాక్.. ది రాజాసాబ్ ఓటీటీ స్ట్రీమింగ్‌లో ట్విస్ట్, ఏం జరిగిందంటే?

బాలయ్య - ఎన్టీఆర్ వార్నింగ్
లైలా విడుదలైన ఏడో రోజునే ఫంకీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. వెంటనే కూర్చొని ఏ సినిమా చేయాలనే బాధపడకుండా రెడీగా సినిమా ఉంది. సినిమాలు రెడీగానే ఉన్నాయి.. కానీ ఎలాంటి సినిమాలు చేయాలనేది డిసైడ్ చేసుకోవాలి. ఒక లూప్‌లో పడిపోయా.. సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వచ్చా. ఈ సంవత్సరం ఏం చేయాలనే దానిపై బాగా ఆలోచించా.. మెంటల్‌గా, ఫిజికల్‌గా ఛార్జ్ అయ్యా. ఫుడ్, డిసిప్లిన్, స్లిపింగ్ అన్ని అలవాట్లు మార్చుకున్నా. ఇప్పుడు స్పీడు తగ్గించి.. ఏ సీన్ చేసినా అదిరిపోవాలని కష్టపడ్డా. ఎన్టీఆర్, బాలయ్యలు నన్ను తమ్ముడిలా చూసుకుంటారు. లైలా సినిమా చూసి బాబాయ్ - అబ్బాయ్ ఇద్దరూ మందలించారు. ఇలాంటి సినిమాలు చేయొద్దని గట్టిగానే చెప్పారని విశ్వక్‌సేన్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఒక యువ హీరో కెరీర్ పట్ల బాలకృష్ణ, ఎన్టీఆర్ తీసుకున్న బాధ్యతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Credit: Filmibeat

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+