సిలికాన్ వ్యాలీ జెఎన్టీయు అలుమ్ని

1984 నుంచి, ఇప్పటి వరకు జెఎన్టీయులో చదివిన విద్యార్థులు కాలిఫోర్నియాలోని సన్నివాలెలో సమావేశమయ్యారు. తమ కళాశాల అనుభవాలను పంచుకుంటూ ఈ సమావేశం ఏర్పాటు చేసిన బుచ్చన్న గాజులను అందరూ అభినందించారు. ప్రతి మూడు నెలలకు ఓసారి ఇటువంటి సమావేశం నిర్వహించాలని సిలికాన్ వ్యాలీ చాప్టర్ నిర్ణయం తీసుకుంది.
సమావేశంలో మామా నాగులో పాటతో సాయి మానప్రగడ అందరినీ అలరించారు. తదుపరి సమావేశాలకు మరింత మందిని ఆహ్వానించి, మరింత భారీగా కార్యక్రమాలు నిర్వహించడానికి నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో వినోదాత్మక కార్యక్రమాలతో పాటు వృత్తిపరమైన ప్రోత్సాహం అందించే కార్యక్రమాలు కూడా ఉంటాయి.












Click it and Unblock the Notifications