ఆటా మెంబర్ అప్రిషియేషన్

మెట్రో ఏరియా రీజినల్ కోఆర్డినేటర్ సౌమ్య కొండపల్లి స్వాగతం చెప్పారు. రెండు దశాబ్దాలుగా ఆటా చేస్తున సేవలను, సాధించిన ఫలితాలను సౌమ్య వివరించారు. ఉత్తర అమెరికాలో, భారత్‌లో ఆటా సభ్యులు, ఇతరులు చేసిన సేవలను ఆమె ఉదహరించారు. ఆటా నిర్వహించిన వివిధ కార్యక్రమాలను కూడా ఆమె వివరించారు. తెలుగు సంస్కృతిని ప్రోత్సహించడానికి, తెలుగు సమాజాన్ని ఏకం చేయడానికి తమ సంఘంలో చేరాలని ఆమె పిలుపునిచ్చారు. ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయం మోసాలకు గురైన భారత విద్యార్థులను తాము ఆదుకున్న తీరును మేరీలాండ్‌కు చెందిన ఆనంద్ బాబు గుమ్మడి వివరించారు. ఆటా న్యాయపరమైన సహాయాన్ని అందించడంలో, ఇతర విషయాల్లోనూ ముందుకు వచ్చినందుకు కృతజ్ఋతుల తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రాంతీయ సమన్వయకర్తలను, సభ్యులను అధ్యక్షుడు డాక్టర్ జిన్నా అభినందించారు. వాషింగ్టన్ డిసి చాప్టర్ ఆటా ట్రస్టీలు భువనేశ్వర్ బూజాలా, రాజేష్ మాదిరెడ్డి తమకు మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా వేసిన ప్రశ్నలకు డాక్టర్ జిన్నా, జయేందర్ అన్నం, రామ్ మోహన్ కొండా సమాధానాలిచ్చారు. పిల్లల వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. లక్ష్య, రచన, శ్రేయ, సాహితి, సంజన, సంహిత, వివేక్, చేతన్ బాలీవుడ్, టాలీవుడ్ పాటలకు నృత్యాలు చేశారు. మేఘన, శైలజ భరతనాట్యం ప్రదర్శన ఇచ్చారు. మేధ వాయిలెన్‌పై జెెస్ బాచ్ కంపోజిషన్ ప్రదర్శన ఇచ్చింది. శ్రేయ తెలుగు సినీ గేయాన్ని ఆలపించింది. డిజె సన్నీ ఈ కార్యక్రమాలకు సహకరించారు. వర్జీనియా ప్రాంతీయ సమన్వయకర్త మనోహర్ ఎనుగు వందన సమర్పణ చేశారు.












Click it and Unblock the Notifications