అమెరికాలో తెలుగు సంఘం పూజ

NRI
దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం (టిఎఎస్‌సి) కొత్త ఎగ్జిక్యూటివ్ బోర్డు ప్రారంభ పూజ ఈ నెల 19వ తేదీన ఇర్విన్ మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి కాలిఫోర్నియాకు చెందిన దాదాపు 150 మంది తమ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. కొత్త కార్యవర్గాన్ని వారు అభినందించారు. కొత్త కార్యవర్గాన్ని అధ్యక్షుడు శ్రీకాంత్ కోమటిరెడ్డి అందరికీ పరిచయం చేశారు. సేవలు చేయడం ద్వారా సంఘం సభ్యత్వాన్ని పెంచాలని ఆయన సూచించారు. సంఘం 40వ వార్షికోత్సవాన్ని పెద్ద యెత్తున నిర్వహిస్తామని ఆయన చెప్పారు. నాటా ఆర్గనైజేషన్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు.

ప్రెసిడెంట్ ఎలెక్ట్ సునీల్ రేలంగి సంఘం జట్టుకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. కమ్యూనిటీని ఏకం చేసేందుకు తన మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. కోశాధికారి సితారాం పామిరెడ్డి సభ్యత్వాన్ని పెంచాలని సూచించారు నాటా ఉపాధ్యక్షులు అనిల్ అర్రబెల్లి, నాగేశ్వర రావు అంకమ్మ కార్యక్రమానికి హాజరై తమ మద్దతు ప్రకటించారు. టిఎఎస్‌సి కార్యదర్శి రమేష్ గట్టు సమావేశానికి హాజరైనవారికి తన కృతజ్ఞతలు తెలిపారు.

కార్యవర్గం - అధ్యక్షుడు శ్రీకాంత్ కోమటిరెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సునీల్ రేలంగి, కార్యదర్శి రమేష్ గట్టు, కోశాధికారి సీతారాం పామిరెడ్డి, గత అధ్యక్షుడు భారతి పిన్నింటి, స్టాండింగ్ కమిటీ చైర్స్ - ధర్మారెడ్డి గుమ్మడి (ఆడిట్), డాక్టర్ మోహన్ మల్లం (బైలాస్), నడదూరు వర్దన్ (లీగల్), విశాల్ శ్రీవాత్సవ (కమ్యూనిటీ సర్వీసెస్), చిన్నా పొన్నగంటి (ఫుడ్), విద్యాసాగర ఎర్రంశెట్టి (హాస్పిటాలిటీ), ప్రసాద్ కోకా (సభ్యత్వ నమోదు), రమేష్ గట్టు (సభ్యత్వ పరిశీలన), శ్రీనివాస్ రాణి (న్యూస్ లెటర్), రామ్ యలమంచిలి (పిక్నిక్ కోఆర్డినేటర్), బాలాజీ వల్లభనేని (పబ్లిసిటీ), రాజా అయసోలా, దీప్తి మట్టపల్లి (ప్రజా సంబంధాలు), సువర్ష కామరాసు, శైలజ దబర్వార్ (తెలుగు భాష), స్వరూప్ ఏపూరి (వేదిక), చక్రి, ప్రత్యూష (యువత కార్యకలాపాలు), ప్రాంతీయ సమన్వయకర్తలు శరత్, రవి బోయపాటి, చిన్న పొన్నగంటి, బాయప్ప రెడ్డి రామ మోహన్, శ్రీనివాస్ చాగంటి మురళి, సోమేష్ రాజు పగిడిపాటి, శ్రీనివాస్, అర్జున్ గిరిధర్ రెడ్డి, అమరేందర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+