వెంట్రుకలతో బస్సును లాగిన మహిళ

బస్సును ఐదు మీటర్లకు మించి లాగి రికార్డు సృష్టించాలనేది ఆమె అభిమతం. రికార్డు సాధించినట్లు ప్రకటించే ముందు దాన్ని ధ్రువీకరించుకుంటున్నారు. ఐరన్ క్వీన్‌గా ప్రసిద్ధి చెందిన ఆ యువతి బస్సును 17 మీటరల్ 20 సెంటిమీటర్ల దూరం లాగింది.
ఆమెకు 62 ఏళ్ల మంజిత్ సింగ్ స్ఫూర్తిని అందించారు. హోషియార్‌పూర్‌లో జన్మించిన మంజిత్ సింగ్ పలు రికార్డులు సాధించారు. తన చెవులకు తాడులు కట్టుకుని ఈస్ట్ మిడ్‌ల్యండ్‌లో విమానాన్ని లాగి ఆయన రికార్డు సాధించారు.
ఆశారాణికి ప్రత్యేకంగా శిక్షణ ఏదీ ఇవ్వలేదని మంజిత్ సింగ్ చెప్పారు. తలతో అద్దాలను బద్దలు చేయడం, చెవులతో వస్తువులను లేపడం వంటివి పదార్థంపై బుద్ధి ఆధిపత్యం సంపాదించడమేనని ఆయన అన్నారు నాలుగైదేళ్ల నుంచి ఆశారాణి నేర్చుకుంటోందని, ఇప్పుడు ఆమె తన కన్నా ఉత్తమమని ఆయన అన్నారు.
మంజిత్ సింగ్ పలు గిన్నిస్ బుక్ రికార్డులు సాధించాడు. 1977లో ఆయన బ్రిటన్ వచ్చాడు. కొద్ది కాలం ఆయన పంజాబ్‌లో పోలీసుగా పనిచేశారు. ప్రొస్టేట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే చారిటీ సంస్థకు మంజిత్ సింగ్, ఆశారాణి విరాళాలు సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications