బ్రిటిష్ గర్ల్‌తో పెళ్లికి నో, డాక్టర్ ఆత్మహత్య

NRI doctor kills self as Pparents reject British fiance
లండన్: వేల్స్‌లోని స్వాన్‌సీ ఆస్పత్రిలో పనిచేస్తున్నా ఓ ఎన్నారై వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బ్రిటిష్ మహిళను పెళ్లి చేసుకోవడానికి అతని తల్లిదండ్రులు నిరాకరించడంతో అతను మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూర్‌కు చెందిన డాక్టర్ మధు హొన్నయ్య అనీస్తీటిస్టుగా పనిచేస్తున్నాడు.

తన ప్రియురాలు డాక్టర్ ఎమ్మా రైటింగ్టన్‌కు దూరం కావాల్సి వస్తుందనే బాధతో సర్జరీలో వాడే రెండు రకాల డ్రగ్స్‌ను ఇంజెక్టు చేసుకుని అతను ఆత్మహత్య చేసుకున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. ఇంక్వెస్ట్‌లో హొన్నయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. తల్లిదండ్రులు సాంస్కృతిక వైరుధ్యాల కారణంగా పెళ్లిని నిరాకరించడంతో ప్రియురాలితో విడిపోయిన ఏడు నెలల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.

నార్త్ - వెస్ట్ ఇంగ్లాండులని లివర్‌‌పూల్లో పనిచేస్తున్నప్పుడు ఇరువురి మధ్య ప్రేమ ఆంకురించింది. తల్లిదండ్రులకు చెప్పకుండా ఇరువురు 2010లో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. సాంస్కృతిక వైరుధ్యాల కారణంగా పెళ్లికి నిరాకరిస్తారని తెలిసి దాన్ని రహస్యంగా ఉంచారు. అయితే, బ్రిటన్‌కు వచ్చిన తల్లిదండ్రులకు ఆ విషయం తెలిసింది. దీంతో హొన్నయ్యకు తమ కులంలోని అమ్మాయితో పెళ్లి చేసేందుకు ప్రయత్నించారు.

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు హొన్నయ్య తన మాజీ ప్రియురాలికి ఫోన్ చేసేందుకు ప్రయత్నించాడని ఇంక్వెస్ట్ రిపోర్టు చెబుతోంది. హొన్నయ్య కోసం రింగ్టన్ ఇంటికి వచ్చి చూస్తే హొన్నయ్య కనిపించలేదని సమాచారం. హొన్నయ్య ఎనిమిది పేజీల సూసైడ్ నోట్ రాశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+