చేతులతో తిన్నందుకు అవమానం

NRI
భారత సంతతికి చెందిన మోడల్, బిగ్ బ్రదర్ రియాల్టీ షో పోటీదారు తీవ్ర అవమానాలకు గురవుతోంది. చేతులతో ఆహారం తీసుకుంటున్నందుకు ఆమె ఈ అవమానాలకు గురువుతోంది. సిటీ సెలిబ్రిటీ బిగ్ బ్రదర్ షోలో 2007లో బాలీవుడ్ నటి శిల్పా షెట్టి కూడా జాతి వివక్ష సంబంధమైన వ్యాఖ్యలకు గురైన విషయం తెలిసిందే. యుకె మిస్ ఇండియా దియానా ఉప్పల్ ఇప్పుడు చానెల్ 5 నిర్వహిస్తున్న షోలో అవమానాలకు గురవుతోంది.

బర్మింగ్‌హామ్‌కు చెందిన ఉప్పల్ తన చేతులతో ఆహారం తీసుకుంటున్నందుకు అవమానాల పాలైంది. భారత ఉప ఖండంలో చేతులతో ఆహారం భుజించడం సర్వసాధారణం. ఆమెతో పాటు పోటీలో పాల్గొంటున్న స్కాట్ మాసన్, అతని ఫ్రెండ్ - ఉప్పల్ ఇండియన్ కాబట్టి చేతులతో తింటోందంటూ వెక్కిరించారు.

అయితే, స్కాట్‌కు బిగ్ బ్రదర్ హెచ్చరికలు చేశారు. తిరిగి ఇటువంటి భాష వాడితే షో నుంచి బయటకు పంపిస్తామని బిగ్ బ్రదర్ స్కాట్‌కు చెప్పారు. ఆ విధంగా మాట్లాడినందుకు స్కాట్ విచారం వ్యక్తం చేశాడు. ఏమైనా, ఇటువంటి స్టీరియో టైప్ వ్యాఖ్యలు సాధారణమై పోయాయి. ఉప్పల్ ఇండియాలోనూ యుకెలోనూ మోడలింగ్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+