వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కూల్ పిల్లలకు బ్యాక్‌ప్యాక్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

PAL
మాస్సాచుసెట్స్: పాల్ (పార్ట్నర్‌షిప్ ఫర్ ద అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ లెర్నింగ్) మససాచుసెట్స్, న్యూయార్క్‌ల్లోని రెండు పాఠశాలల విద్యార్థులకు బ్యాక్‌ప్యాక్స్‌ను అందించింది. ఇలా ఆ సంస్థ విద్యార్థులకు బ్యాక్‌ప్యాక్స్ ఇవ్వడం వరుసగా ఇదే మూడో ఏడాది. నోట్‌బుక్స్, పెన్సిల్స్, క్రెయాన్స్, పెన్సిల్ కేస్‌లు ఉన్న బ్యాక్‌ప్యాక్స్‌ను విద్యార్థులకు ఆ సంస్థ అందించింది.

సంస్థ 850 బ్యాక్‌ప్యాక్స్‌ను విద్యార్థులకు అందించడానికి 20వేల డాలర్ల విరాళాలు సేకరించింది. వాటిలో న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో గల పబ్లిక్ స్కూల్ 108, సాల్ అబ్రసియామెంటో స్కూల్ విద్యార్థులకు 400 బ్యాక్‌ప్యాక్స్‌ను, మసాచుసెట్స్‌లోని రోక్స్‌బురీలో గల ఎల్లిస్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు 450 బ్యాక్‌ప్యాక్స్‌ను అందించింది.

ఎల్లీస్ ఎలిమెంటరీ స్కూల్ కార్యక్రమానికి బోస్టన్ మేయర్ థామస్ మెనినో, స్కూల్ కమిటీ చైర్‌పర్సన్ డాక్టర్ గ్రెగరీ గ్రూవర్ హాజరయ్యారు. బోస్టన్‌లోని స్కూల్ విద్యార్థులకు సహాయం అందించడానికి ముందుకు వచ్చిన సురేన్ నన్నపనేనని, పాల్‌ను మోయర్ మెనినో అభినందించారు.

బ్రూక్లిన్‌లో జరిగిన కార్యక్రమానికి న్యూయర్ నగర విద్యాశాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జెస్సీ మోజికా హాజరై పాల్ సేవానిరతిని అభినందించారు. పిఎస్ 108 స్కూల్ ప్రిన్సిపాల్, సిబ్బంది పాల్‌కు కృతజ్ఢతలు తెలిపారు. బడ్జెట్ కోతలతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని, పాల్ ఈ సహాయం చేయడం తమకెంతో లాభిస్తుందని ప్రిన్సిపాల్ అన్నారు. లాభదాయకం కాని పాల్‌ను విద్యార్థులే నడిపిస్తున్నారు.

English summary
PAL (Partnership for the Advancement of Learning) for the third year in a row has donated backpacks filled with supplies including notebooks, pencils, crayons, and pencils cases to two schools in Massachusetts and New York.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X