వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబామా క్యాబినెట్లో రాజీవ్ షా

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajiv Shaw
వాషింగ్టన్: అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్ఎయిడ్)కి అధిపతిగా ఉన్న ప్రవాస భారతీయుడు రాజీవ్ షాకు ఇప్పుడు మరో అత్యున్నత గౌరవం లభించే అవకాశాలున్నాయి. బరాక్ ఒబామా రెండోసారి అధికారపగ్గాలు చేపట్టిన తార్వత ఆయనను తన కేబినెట్‌లోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. యూఎస్ ఎయిడ్ అధినేతగా తన సమర్థతను నిరూపించుకోవడమే కాక, ఒబామాకు కూడా విధేయుడిగా ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశాలు. బహుశా ఆయనకు ఆరోగ్య, వ్యవసాయ, విద్యాశాఖల్లో ఏదో ఒకటి లభించవచ్చని చెబుతున్నారు.

దానికి తోడు, షాకు రిపబ్లికన్లు, డెమొక్రాట్లు - ఇద్దరి మద్దతు ఉంది. దీంతో ఆయన సెనేట్‌కు ఎంపిక కావడానికి కూడా ఇబ్బందులేమీ ఉండవు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు ఆర్థిక, అభివృద్ధి, మానవీయ సాయాలు అందించే యూఎస్ఎయిడ్‌ను గత మూడున్నరేళ్లుగా సమర్థంగా నడిపిస్తున్న చరిత్ర షాకు ఉంది. అయితే, ప్రస్తుతానికి కేబినెట్ నియామకాలకు సంబంధించిన సమాచారమేదీ తమవద్ద లేదని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి జే కార్నీ అంటున్నారు.

యూఎస్ ఎయిడ్‌లోకి వచ్చేముందు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌లో షా పనిచేశారు. హైతీ భూకంపం, పాకిస్థాన్ వరదలు వంటి అనేక సందర్భాల్లో అమెరికా ఉదారంగా స్పందించడానికి ప్రధాన కారణం షానే. మిచిగన్‌లో స్థిరపడిన హిందూ తల్లిదండ్రులకు ఈయన అక్కడే జన్మించారు.

అసెంబ్లీకి శాంతి గాంధీ

కాగా, మహాత్మాగాంధీ మునిమనవడు కాన్సాస్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసిన శాంతి గాంధీ (72) తన ప్రత్యర్థి, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి థియోడర్ ఎన్‌స్లేని 9% ఓట్ల తేడాతో ఓడించారు. ఆయన మహాత్మాగాంధీ మనవడు దివంగత కాంతిలాల్, సరస్వతిల కుమారుడు. కాన్సాస్ రాష్ట్రంలోని టోపెకా నగరంలో కార్డియో వాస్క్యులర్, థొరాసిక్ సర్జన్‌గా పనిచేసిన గాంధీకి 6,413 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థికి 5,357 ఓట్లు మాత్రమే వచ్చాయి. యూనివర్సిటీ ఆఫ్ బాంబేలో వైద్యవిద్య పూర్తిచేసిన తర్వాత 1967లో ఆయన అమెరికా వెళ్లారు.

English summary
US president Barack Obama may induct NRI Rajiv Shaw in his cabinet. Rajiv Shaw is heading USAID at present. Rajiv Shaw is enjoying the support of republicans and democrats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X