ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో తెలుగమ్మాయి డ్యాన్స్

ఈ మేరకు ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ నుంచి ఆమెకు ఆహ్వానం అందింది. పదేళ్లుగా స్థానిక నృత్య పాఠశాలలో జీవికా శేరి కూచిపూడి, భరతనాట్యం తదితర నాట్య రీతులను సాధన చేస్తోంది. పలుచోట్ల ప్రదర్శనలు కూడా ఇచ్చింది. ఆమె తల్లి దండ్రులది నిజామాబాద్ జిల్లా. ప్రస్తుతం జీవికా శేరి పదో తరగది చదువుతోంది.
కాగా జీవికా శేరికి ఒలింపిక్స్ నుండి ఆహ్వానం అందడంపై న్యూజెర్సీ తెలుగు కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేసింది. ఎస్ఎస్ రెడ్డి, మాధవి తనయ జీవికా శేరి ఒలింపిక్స్‌లో నాట్య ప్రదర్శన ఇవ్వడం గర్వకారణంగా ఉందన్నారు. జీవికాకు రాహుల్ శేరి అనే ఓ సోదరుడు ఉన్నాడు.
జీవికా శేరి ఎడిసన్‌లోని జెపి స్టీవెన్ హైస్కూల్‌లో పదో తరగది చదువుతోంది. జీవిత తన డ్యాన్స్ కేరీర్‌ను తన ఐదో ఏటనే ప్రారంభించింది. ఇండియానికా అకాడమీ తరఫున పలు ప్రదర్శనలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications