డల్లాస్‌లో 'పాడిన తెనుగు పాట'

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు, గాయకుడు ఘంటసాల రత్నకుమార్‌ని పరిచయం చేస్తూ ఆయన 1076 సినిమాలకు, దాదాపు పదివేల టీవీ ధారావాహికలకు డబ్బింగ్ చెప్పారని వివరించారు. ఘంటసాల రత్నకుమార్ తన తండ్రి, అమరగాయకుడు స్వ్రర్గీయ ఘంటసాల మధుర గీతాలెన్నో ఆలపించి సభికులను ఆకట్టుకున్నారు.
కార్యక్రమాన్ని దేవరాజు రామం కాళహస్తి మహత్మ్యం లోని "జయ జయ మహదేవ" అనే పాటతో ప్రారంభించారు. తరువాత ఘంటసాల రత్నకుమార్ "బ్రహ్మ కడిగిన పాదము" అనే అన్నమాచార్య కీర్తనను స్థానిక గాయకులందరి కోరస్ తో ఆలాపించారు.
కార్యక్రమంలోని మిగతా పాటల వివరాలు
ఘంటసాల, ఇనగంటి కస్తూరి -- ఊహలు గుసగుసలాడె
ఘంటసాల, ఇనగంటి కస్తూరి -- రాగాలా సరాగాలా
ఘంటసాల, పెనుమర్తి జయ-- నన్ను దోచుకొందువటే
ఘంటసాల, పెనుమర్తి జయ-- వేషము మార్చెను
ఘంటసాల -- నా హృదయంలో నిదురించే
ఘంటసాల -- ఎవరికి వారౌ స్వార్థంలో
ఘంటసాల -- బాబూ వినరా
ఘంటసాల -- అందమె ఆనందం
ఘంటసాల-- పాడుతా తీయగా
ఘంటసాల -- మానవుడే మహనీయుడు
ఘంటసాల-- గోరొంక గూటికే
ఘంటసాల, మద్దుకూరి చంద్రహాస్ -- మా ఊళ్ళో ఒక పడుచుంది
దేవరాజు రామం, దేవరాజు వీణ -- చెలికాడు నిన్నే రమ్మని పిలువ
రాయవరం భాస్కర్, దేవరాజు వీణ -- సుందరి నీ వంటి దివ్య స్వరూపము
దేవరాజు రామం, తడిమేటి కళ్యాణి -- మనసు పరిమళించెనే
కలపాటపు రమేశ్, తడిమేటి కళ్యాణి -- ఆకాశ వీధిలో
ఇయ్యున్ని శ్రీనివాస్, పెనుమర్తి జయ -- చూపులు కలసిన శుభవేళ
ఇయ్యున్ని శ్రీనివాస్, యలమంచిలి వీణ -- వాడిన పూలే వికసించెనే
చింతలపాటి శ్రీధర్, శిరీష -- తోటలో నా రాజు
చింతలపాటి శ్రీధర్, ఆదూరి సృజన -- హాయి హాయిగా ఆమని
మద్దుకూరి చంద్రహాస్, పెనుమర్తి జయ -- లాహిరి లాహిరి లాహిరిలో
మద్దుకూరి చంద్రహాస్, యలమంచిలి వీణ -- మధురం మధురం
పాటల మధ్యలో ప్రముఖ మిమిక్రీ కళాకారుడు జితేంద్ర "ఏదో ఒక రాగం" అనే బాల సుబ్రహ్మణ్యం పాటను ఉదిత్ నారాయణ్, గోగుల రమణ వంటి వేరే గాయకులు పాడితే ఎలా ఉంటుందో పాడి వినిపించారు. సమరసింహారెడ్డిలోని బాలకృష్ణ డైలాగులు వేరే తెలుగు హిందీ హీరోలు హాస్యనటులు చెబితే ఎట్లా ఉంటుందో వినిపించి సభికులను కడుపుబ్బ నవ్వించారు.
కార్యక్రమం మధ్యలో ఘంటసాల రత్నకుమార్‌ని ఘంటసాల పాటల అభిమాని డా. సి ఆర్ రావు, డా. ఆళ్ళ శ్రీనివాస్ శాలువాతో సత్కరించగా మల్లవరపు అనంత్, రాజేంద్ర నారాయణ్ దాస్ ఆయనకు జ్ఞాపికను సమర్పించారు. చివరిగా ఓహ్రీస్ రెస్టారెంటు యజమాని యార్లగడ్డ వెంకట్ రత్నకుమార్, జితేంద్రలకు అభినందనలు తెలిపి వారిని సత్కరించారు.












Click it and Unblock the Notifications