తెలంగాణకు హరితహారం: లండన్‌లో టీఆర్ఎస్ ఎన్నారై అవగాహన కార్యక్రమం

Subscribe to Oneindia Telugu

లండన్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బంగారు తెలంగాణ నిర్మాణం లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమం "తెలంగాణ కు హరితహారం".
ఇటీవల కరీంనగర్ లో ఎల్‌ఎండీ వద్ద సీఎం కేసీఆర్‌ మూడో విడత హరితహారాన్ని 40 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

 awareness program of telangana haritha haram in london

ఎన్నారై టీఆర్ఎస్ ఆద్వర్యంలో లండన్‌లో 'తెలంగాణకు హరితహారం'పై అవగాహన కార్యక్రమం నిర్వహించి సభ్యులంతా మొక్కలు నాటి, ప్రజలంతా ఇందులో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

జాతీయ అటవీ పాలసీ కింద పర్యావరణ స్థిరత్వం మరియు పర్యావరణ సంతులనం కొనసాగించటానికి మొత్తం భూమి విస్తీర్ణంలో కనీసం ౩౩శాతం భూమి అడవులు / చెట్లు ఉండాలని, ఇది సమస్త జీవులు, మానవ, జంతు మరియు మొక్కల సంరక్షణ కోసం కీలకమైన అవసరం అని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో, మొత్తం విస్తీర్ణంలో అటవీ ప్రాంతం కేవలం 25.16 శాతంగా ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం మొత్తం విస్తీర్ణంలో కావలసిన ౩౩శాతం స్థాయికి అడవులను/పచ్చదనం పెంచడానికి భారీ అటవీకరణ కార్యకలాపాలలో భాగంగా ఒక ప్రధాన కార్యక్రమం "తెలంగాణ హరిత హారంను ముందుకు తీసుకొచ్చిందని తెలిపారు.

 awareness program of telangana haritha haram in london

లక్ష్యం : 230 కోట్ల మొక్కలు
అటవీ ప్రాంతాలు : 100 కోట్ల మొక్కలు
అటవీ ప్రాంతాలు కానివి : 120 కోట్ల మొక్కలు
హెచ్.ఎం.డి.ఎ. : 10 కోట్ల మొక్కలు
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 40 లక్షల చొప్పున మొక్కలు నాటాలనే లక్ష్యం తో ముందుకు వెళ్తున్నారని సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమం లో ఎన్నారై టి.ఆర్.యస్ నాయకులతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు కూడా పాల్గొని ప్రజలందరినీ "తెలంగాణ కు హరితహారం" లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
లండన్ లోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆద్వర్యం లో వెస్ట్ లండన్ లో హాజరై స్థానికి ప్రవాసులతో కలిసి మొక్కలు నాటి ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

 awareness program of telangana haritha haram in london

కార్యక్రమంలో అద్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, కార్యదర్శిల శ్రీధర్ రావు తక్కలపెల్లి మరియు సృజన్ రెడ్డి చాడా, ముఖ్య నాయకులు రాజేష్ వర్మ, శ్రీకాంత్ జెల్లా, రవి రతినేని, సురేష్ బుడగం, వినయ్ ఆకుల,సత్య చిలుముల, రమేష్ ఎసెంపల్లి, వేణు మరియు జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్ రావు బాలమూర్తి, జాగృతి నాయకులు లండన్ గణేష్ ,వంశీ సముద్రాల, టాక్ సభ్యులు రాకేష్ వాకా, వెంకీ, రవి కిరణ్, రాకేష్ పటేల్, ప్రతీక్
తదితరులు హాజరైన వారిలో ఉన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TRS NRI cell members conducted awareness 'telangana haritha haram' program in London.
Please Wait while comments are loading...