డెట్రాయిట్‌లో బతుకమ్మ వేడుక
న్యూయార్క్: డెట్రాయిట్ తెలంగాణ సంఘం(డిటిసి) ఆధ్వర్యంలో అమెరికాలోని ప్రవాస తెలంగాణ వాసులు బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఫార్మింగ్టన్ హిల్స్‌లోని సెయింట్ తోమ బెనక్విట్ హాల్‌లో శనివారం నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో సుమారు వేయిమందికిపైగా మహిళలు పాల్గొన్నారు.
ఈ ఉత్సవాలను డెట్రాయిట్ తెలంగాణ సంఘం అధ్యక్షుడు నాగేందర్ ఐత తన ప్రసంగంతో ప్రారంభించారు. చిన్నా పెద్దలందరూ కూడా అందంగా తయారు చేసిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ.. ఉత్సాహంగా పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. సాంప్రదాయ వస్త్రధారణతో అందంగా తయారైన చిన్నారులు, మహిళలు ఉత్సవాల్లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సంవత్సరం భారీ సంఖ్యలో బతుకమ్మలతో మహిళలు పాల్గొన్నారని నిర్వహికులు తెలిపారు. ఉత్సవ నిర్వాహకులు ప్రతీ ఒక్క బతుకమ్మకు ఒక వెండి నాణెన్ని బహుమతిగా ఇచ్చారు. అందంగా తయారు చేసిన తొలి ఏడు బతుకమ్మలకు ట్రోఫీలను, బంగారు నాణెలను అందజేశారు. బతుకమ్మలన్నీ కూడా అందంగా ఉండడంతో అందులో అందమైనది ఎంపిక చేయడం కష్టంగా మారిందని నిర్వహకులు తెలిపారు.
నిర్వాహకులు వెంకట్ మంథెన ఈ ఉత్సవాలకు బాల్కొండ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ అనిల్ ఎరవత్రిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం పట్ల తెలంగాణ డెట్రాయిట్ సంఘాన్ని అనిల్ అభినందించారు. నిర్వాహక సభ్యులు భరత్ మాదాడి, తదితరులు కార్యక్రమానికి హాజరైన అనిల్ ఎరవెత్రి, గోరెటి వెంకన్న, రవి చక్తి, రవి తోకలను సత్కరించారు. తెలంగాణ జాగృతి ఓవర్సీస్ కో-ఆర్డినేటర్ శ్రీధర్ బండారు కూడా ఉత్సవాలకు హాజరై అభినందించారు.
కార్యక్రమం అనంతరం పులిహోర, కొబ్బరి అన్నం, లెమన్ రైస్, టమోటో రైస్, పెరుగన్నం మొదలగు వంటకాలను నిర్వహకులు వడ్డించారు. రుచికరమైన భోజన వసతిని కల్పించిన మిర్చి రెస్టారెంట్‌కు నిర్వాకులు కృతజ్ఞతలు తెలిపారు. విజయ్ పల్లెర్ల, విక్యాతి పల్లెర్లల ఆధ్వర్యంలో చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. తెలంగాణ ప్రజాకవి గోరెటి వెంకన్న, రేలారే రేలా ఫేం రవి చక్తి, అమెరికా గద్దర్‌గా పేరుపొందిన రవి తోకలలు తమ పాటలతో అలరించారు.
ఇక్కడ జరుపుకుంటున్న బతుకమ్మ సంబరాలను చూస్తుంటే మనం అమెరికాలో ఉన్నామా లేక భారతదేశంలో ఉన్నామా అనే సందేహం కలుగుతోందని గోరెటి వెంకన్న అన్నారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్, కాశీ కోఠ, కృష్ణ నిచనమట్ల, సిస్టర్ మోర్టేజ్, శ్రీనివాసరావు గాలి, తెలంగాణ డెట్రాయిట్ సంఘం సభ్యులు భరత్ మాదాడి, నాగేందర్ ఐత, వెంకట్ మంథెన, రాంగోపాల్ ఉప్పుల, భుజంగరావు, హరి పరంకుశం, రాజు బ్రహ్మానందభేరి, హరి మారోజు, శైలేంద్ర సనం, తిరుపతి వెంగటి, శ్రీధర్ బండారు, సునీల్ మర్రి, వెంకట్ దేవర, మురళి బొమ్మనవేని, కృష్ణ గుడుగుంట్ల, శ్రీనివాస్ రాజు ధేనువకొండ, విజయభాస్కర్ పల్లెర్ల, శ్రీనివాసరావు గాలి పాల్గొన్నారు.













Click it and Unblock the Notifications