NRI News: నార్త్​ కరోలినాలో బతుకమ్మ సంబురాలు..

తెలంగాణలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వారు ఎక్కడున్నా బతుకమ్మను మరిచిపోరు. ప్రపంచంలో ఎక్కడున్నా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తుంటారు. తాజాగా అమెరికాలోని నార్త్​ కరోలినా రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం దసరా సంబురాలు ఘనంగా చేశారు. ట్రయాంగిల్​ తెలంగాణ అసోషియేషన్​ (టీటీజీఏ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకలకు 7 వేల మంది హాజరయ్యారు.

నార్త్ కరోలినాలో ఉన్న తెలంగాణ వారంతా కలిసి ఈ వేడుకలు నిర్వహించారు. రకరకాల పూలతో బతుకమ్మను పేర్చారు. అందురు కలిసి ఒక్క చోట చేరి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమం దాదాపు 6 గంటల పాటు కొనసాగింది. ఈ కార్యక్రమంలో సెనేటర్ జేజే చౌదరి పాల్గొన్నారు. టీటీజీఏ అధ్యక్షుడు మహిపాల్ బిరెడ్డి, ఉపాధ్యక్షురాలు భారతి వెంకన్నగారి, ఈవెంట్ డైరెక్టర్ శశాంక్ ఉండీల, సాంస్కృతిక డైరెక్టర్ పూర్ణ అల్లె ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అటు దుబాయ్ లో కూడా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Bathukamma celebrations were held grandly in North Carolina America

యూఏఈ రాజధాని అబుదాబిలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందుకోసం 3 క్వింటాళ్ల పూలను తెలంగాణ నుంచి అక్కడికి దిగుమతి చేసుకున్నారు. తంగేడు, గునుగుతో బతుకమ్మలు పేర్చారు. ఆడబిడ్డలంతా ఒక్క చోట చేరి బతుకమ్మ ఆడారు. తర్వాత తెలంగాణ పిండి వంటలను అందరికి అందించారు. ఇంగ్లండ్ లో కూడా తెలంగాణ వారు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రీడింగ్‌లో ఉన్న తెలంగాణ వారంతా బతుకమ్మ ఆడి పాడారు.

ఈ వేడుకలకు సుమారు వెయ్యి మంది హాజరైనట్లు అధ్యక్షులు విశ్వేశ్వర మంథని, ఉపాధ్యక్షులు ప్రసాద్‌ అవధానుల చెప్పారు. అంతకు ముందు న్యూజిలాండ్ లోని అక్లాండ్ లో కూడా తెలంగాణ వారు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఆడబిడ్డలంతా కలిసి ఆడిపాడారు. ఎక్కడికి వెళ్లినా మన సంస్కృతిని మరిచిపోమని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+