వెళ్లిపోకుంటే మీ పిల్లల్ని చంపేస్తా: భారతీయ దంపతులకు కెనడాలో బెదిరింపులు, అరెస్ట్
Recommended Video

ఒట్టావా: దేశం విడిచి వెళ్లకుంటే మీ పిల్లల్ని చంపేస్తామంటూ కెనడాలో భారతీయ దంపతులను బెదిరించారు. కెనడాకు చెందిన ఓ వ్యక్తి భారతీయ జంటపై జాతి వివక్షతో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఒంటారియాలోని హామిల్టన్‌లో వాల్‌మార్ట్ సూపర్ సెంటర్ పార్కింగ్ స్థలంలో భారత సంతతికి చెందిన దంపతులతో 47 ఏళ్ల డేల్ రాబర్ట్ సన్ వివాదం ఏర్పడింది.
ఈ గొడవలో మాటమాటా పెరిగింది. దీంతో ట్రక్కులో వచ్చిన డేల్ రాబర్ట్ సన్ వారి పైకి ఒక్కసారిగా యాక్సిలరేటర్ పెంచి, ఆ తర్వాత బ్రేక్ వేశాడు. అతను బ్రేక్ వేసిన తర్వాత భారతీయ వ్యక్తి భార్యకు ట్రక్కు తగిలింది.

నేను నా దేశం వెళ్లాలని కోరుకుంటున్నావా, కానీ నేను కెనడా సిటిజన్‌ను అని రాబర్ట్ సన్‌తో భారతీయ వ్యక్తి అన్నారు. దానికి రాబర్ట్ సన్ స్పందిస్తూ.. నీవు ఇక్కడి వాడివని చెప్పేందుకు ఆధారాలు చూపించాలని, నిన్ను నమ్మేది లేదని, నువ్వు ఇక్కడి వాడిలా మాట్లాడకని అన్నాడు.
నేను జాత్యాహంకరానినని, నాకు నువ్వు నచ్చలేదని, ఆమె (భారతీయుడి భార్య) నచ్చలేదని, ఇక్కడే ఉంటే మీ పిల్లల్ని చంపేస్తానని అతను హెచ్చరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే సదరు భారత సంతతి దంపతుల వివరాలు వెల్లడించలేదు. వారు భారత్ నుంచి వెళ్లి కెనడాలో ఉంటున్నారు. వారికి సిటిజన్‌షిప్ ఉంది. హామిల్టన్ పోలీసులు ఈ జాతి వివక్షపై దర్యాఫ్తు చేస్తున్నారు. రాబర్ట్ సన్‌పై జాతి వివక్ష, బెదిరింపులు, ప్రమాదకర డ్రైవింగ్ తదితర నేరారోపణలతో అరెస్టు చేశారు.
-
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
T20 World Cup Final: భారత పేసర్ కు ఐసీసీ డబుల్ షాక్..! -
ప్లీజ్ మా నాన్న "ఏడో పెళ్లి" ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!











Click it and Unblock the Notifications