వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షిప్టు మార్పు: ఎంహెచ్17 ఘటనలో భారతీయుడి మృతి

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్: మలేషియా విమానం ఎంహెచ్ 17 ప్రమాదంలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి మరణించాడు. భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన సంజిద్ సింగ్ సందు తను తొందరగా ఇంటికెళ్లాలని తన షిఫ్టును మార్చుకున్నాడు. ఆ నిర్ణయమే అతని ప్రాణాలను తీసింది. ఈ ప్రమాదంలో మొత్తం 298 మంది మృతి చెందారు.

మలేషియా విమాన సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్న సింజిద్ సింగ్.. తన తోటి ఉద్యోగితో చెప్పి తన షిప్టును మార్చుకున్నాడు. అయితే ఆయన ఎంహెచ్-17 విమానంలో వెళ్లాల్సిన వాడు కాదు. కానీ తన సహచరుడితో షిప్టు మార్చుకుని మరీ ఆమ్‌స్టర్‌డమ్ నుంచి కౌలాలంపూర్ వెళ్లే విమానం ఎక్కాడు.

Indian-origin man killed in Malaysia Airlines MH-17 crash; he swapped shifts

సంజిద్ సింగ్ సందు మలేషియాలోని పెనాంగ్ నగరంలో ఉన్న తమ ఇంటికి రాగానే అతడికి ఇష్టమైన వంటకాలన్నీ చేసి పెట్టాలని అతని తల్లి భావించినట్లు తండ్రి జిజర్ సింగ్ ఆవేదనగా తెలిపారు. స

విమానం ఎక్కడానికి కొద్ది సేపటి ముందే తనతో ఫోన్‌లో మాట్లాడాడని, అదే తమ అబ్బాయితో మాట్లాడిన చిట్టచివరి సంభాషణ అని చెప్పారు. ఎందుకిలా జరిగిందంటూ ఆయన కన్నీటి పర్యాంతమయ్యారు. సందు భార్య కూడా మలేషియా ఎయిర్స్‌లైన్స్‌లో స్టెవార్డెస్‌గా పని చేస్తున్నారు. ఆమె ద్వారానే సందు తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది.

English summary
Swapping shift with a colleague cost ethnic Indian flight steward Sanjid Singh Sandu his life onboard Malaysia Airlines MH-17 jet crash.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X