19 ఏళ్లకే.. రూ.100 కోట్లు సంపాదించిన భారత సంతతి యువకుడు!
భారత సంతతికి చెందిన అక్షయ్ రూపారెలియా(19) అత్యంత పిన్నవయసులో బ్రిటన్ కోటీశ్వరులైన వారిలో ఒకరిగా నిలిచారు.
లండన్: భారత సంతతికి చెందిన అక్షయ్ రూపారెలియా(19) అత్యంత పిన్నవయసులో బ్రిటన్ కోటీశ్వరులైన వారిలో ఒకరిగా నిలిచారు. కేవలం 16 నెలల్లోనే తన ఆన్లైన్ స్థిరాస్తి సంస్థను 12 మిలియన్ పౌండ్ల (రూ. 103 కోట్లకు పైగా)కు చేర్చడం ద్వారా ఈ ఘనతను సాధించారు.
కేవలం 7 వేల పౌండ్లు (సుమారు రూ.6.02 లక్షలు) పెట్టుబడిగా పెట్టాడు అక్షయ్. అది కూడా బంధువుల నుంచి అప్పుగా తీసుకున్నదే. 'డోర్‌స్టెప్స్.కో.యూకే' వెబ్సైట్ ద్వారా తన వ్యాపారాన్ని యూకేలో 18వ అతిపెద్ద స్థిరాస్తి సంస్థగా నిలబెట్టారు.

విద్యార్థిగా ఉంటూనే సంస్థను ప్రారంభించి అభివృద్ధి చేశారు అక్షయ్ రూపారెలియా. యూకేలో స్వయం ఉపాధి సాధిస్తున్న తల్లుల నుంచి స్థిరాస్తి సమాచారాన్ని తీసుకోవడం అనేది అతని వ్యాపార ఆలోచనల్లో కీలకం.
ఇంతవరకూ తాను 100 మిలియన్ పౌండ్ల (దాదాపు రూ. 860 కోట్లు) స్థిరాస్తులను విక్రయించినట్లు అక్షయ్ తెలిపారు. ఆర్థిక, గణిత శాస్త్రాల్లో చదువుకోవడానికి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అవకాశం వచ్చినప్పటికీ అక్షయ్ తన వ్యాపారాన్ని విస్తరించడానికే నిర్ణయించుకున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications