న్యూజెర్సీలో బతుకమ్మ వేడుక: ఆడిపాడారు(పిక్చర్స్)

న్యూయార్క్: న్యూజెర్సీ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని జాన్సన్ పార్కులో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో 700మందికిపైగా తెలుగు ప్రవాసులు సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని సందడి చేశారు. ఉదయమే లేచిన మహిళలు అక్కడ లభించే రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి ఇక్కడికి చేరుకున్నారు.

ఇక్కడ మధ్యాహ్నం ఏర్పాటు చేసిన పసందైన విందు కార్యక్రమం అనంతరం సాయంత్రం సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన మహిళలు, యువతులు అందంగా పేర్చిన బతుకమ్మలతో వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మల చుట్టూ లయబద్దంగా తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. మనదేశం నుంచి వచ్చిన మిమిక్రీ కళాకారుడు బతుకమ్మ పాటలు పాడి, మిమిక్రీతో ఆకట్టుకున్నారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

న్యూజెర్సీ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని జాన్సన్ పార్కులో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

ఈ వేడుకల్లో 700మందికిపైగా తెలుగు ప్రవాసులు సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని సందడి చేశారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

ఉదయమే లేచిన మహిళలు అక్కడ లభించే రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి ఇక్కడికి చేరుకున్నారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

ఇక్కడ మధ్యాహ్నం ఏర్పాటు చేసిన పసందైన విందు కార్యక్రమం అనంతరం సాయంత్రం సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన మహిళలు, యువతులు అందంగా పేర్చిన బతుకమ్మలతో వేడుకల్లో పాల్గొన్నారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మల చుట్టూ లయబద్దంగా తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. మనదేశం నుంచి వచ్చిన మిమిక్రీ కళాకారుడు బతుకమ్మ పాటలు పాడి, మిమిక్రీతో ఆకట్టుకున్నారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

రెండు గంటలపాటు బతుకమ్మ ఆడిన మహిళలు సమీపంలోని సరస్సులో నిమజ్జనం చేశారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా బతుకమ్మను మహిళలు వేడుకున్నారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

మిమిక్రీ రమేష్ బతుకమ్మ పండగ యొక్క చరిత్ర, ప్రాధాన్యతను తెలిపారు. అందంగా అలంకరించిన బతుకమ్మలకు ఈ సందర్భంగా ఆయన బహుమతులను అందజేశారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

సురేఖ యెర్రం, సరిత, సుచిత్రలు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకున్నారు. యునిక్ బతుకమ్మ బహుమతులను సుమలతా రెడ్డి, జ్యోతి యాష్కీ, ప్రణీతలకు అందజేశారు.

రెండు గంటలపాటు బతుకమ్మ ఆడిన మహిళలు సమీపంలోని సరస్సులో నిమజ్జనం చేశారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా బతుకమ్మను మహిళలు వేడుకున్నారు. మిమిక్రీ రమేష్ బతుకమ్మ పండగ యొక్క చరిత్ర, ప్రాధాన్యతను తెలిపారు. అందంగా అలంకరించిన బతుకమ్మలకు ఈ సందర్భంగా ఆయన బహుమతులను అందజేశారు. సురేఖ యెర్రం, సరిత, సుచిత్రలు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకున్నారు.

యునిక్ బతుకమ్మ బహుమతులను సుమలతా రెడ్డి, జ్యోతి యాష్కీ, ప్రణీతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రవి తోట, నాగేందర్ రెడ్డి యాస, డాక్టర్ పూర్ణచందర్ సిరికొండ, సురేష్ జిల్లా, పరమేశ్ రెడ్డి, దామోదర్ గేదెల, సతీష్ దాసరిలు పాల్గొన్నారు. కార్యక్రమ విజయవంతానికి సహకరించిన వాలంటీర్లు రవి ధన్నపునేని, మహేష్ పొగాకు, భాస్కర్ భూపతి, రమేష్ మాగంటి, రాజం చిలుక, రవి పెద్ది, కిశోర్ భూపతి, శ్రీకాంత్ గౌడ్ అక్కపల్లి, ప్రదీప్ సువర్ణ, శ్రీకుమార్ తోకల, గురునాధాం ఆలంపల్లి, మోహన్ రెడ్డి దేశిడి, శ్రీనివాస్ గంగోని, ప్రశాంత్ చింతావర్‌లకు నిర్వాహకులు సంగీత ధన్నపునేని, కల్పన సువర్ణ, కవితా పెద్ది, ఇందూ బాస, విద్యా వెంకటయోగి, శ్రీప్రియ అక్కపల్లి, భాను మాగంటి, రాణి వెలిశాల, మంజుల గనగోని కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+