టాక్ 'లండన్-చేనేత బతుకమ్మ-దసరా వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ కవిత

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆద్వర్యం లో సెప్టెంబర్ ౩౦ వ తేదీనాడు నిర్వహిస్తున్న 'లండన్ - చేనేత బతుకమ్మ - దసరా ' వేడుకల పోస్టర్‌ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవిత ఆవిష్కరించారు.

బుధవారం హైదరాబాద్‌లో టాక్ ప్రతినిధులు రాజ్ కుమార్ శానబోయిన మరియు సుభాష్ కుమార్ ఎంపీ కవిత ను కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనివ్వడానికి చేస్తున్న కార్యక్రమాలకు స్పూర్తితో, ఈ సంవత్సరం టాక్ జరిపే వేడుకలను "చేనేత బతుకమ్మ" గా నిర్వహిస్తున్నామని, వీలైనంత వరకు ప్రవాసులల్లో చేనేత పై అవగాహన కలిపించి, వీలైనన్ని సందర్భాల్లో చేనేత వస్త్రాలు ధరించి నేత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నట్టు తెలిపారు.

tauk dussera batukamma posters released by mp kavita

చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ కవిత.

లండన్ నుండి టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది ఫోన్ ద్వారా మీడియా కి తన సందేశాన్నిస్తూ, టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని సందర్భాలలో ఎంపీ కవిత గారి ప్రోత్సాహం చాలా గొప్పదని, నేటి "చేనేత బతుకమ్మ" పోస్టర్ ఆవిష్కరించి మాలో నూతన ఉత్సాహాన్ని నింపిన కవిత గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసినట్టు చెప్పారు.

గతంలోనే కవిత గారు లండన్ పర్యటనకు వచ్చిన సందర్భం లో "చేనేత బతుకమ్మ" ఆలోచనను వారికి వివరించామని, వారు కూడా మాకు ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చి ప్రోతషించారని, చేనేత కుటుంబాల సంక్షేమం పట్ల వారికి ఎంత శ్రద్ధ ఉందని, ఇటువంటి కార్యక్రమాల వల్ల వారికి వీలైనంత చేయూత అందితే చాలా సంతోషమని అభిప్రాయపడ్డట్టు తెలిపారు.

tauk dussera batukamma posters released by mp kavita

సెప్టెంబర్ ౩౦ వ తేదీనాడు ఉదయం పది గంటల నుండి వెస్ట్ లండన్ లోని " ఐసల్ వర్త్ అండ్ సయాన్ స్కూల్"( Isleworth and Syon School,Ridgeway Road,Isleworth,Middlesex,TW75LJ) ఆడిటోరియం లో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రవాస బిడ్డలంతా వీలైతే చేనేత దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొనాలని, మనంత చేనేతకు అండగా నిలవాల్సిన చారిత్రాత్మక సమయమిదని తెలిపారు.

చేనేత వస్త్రాలకై www.tauk.org.uk వెబ్‌సైట్ సందర్శితే వివరాలు ఉన్నాయని తెలిపారు.

నేడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా చేనేత చీరలను అందిస్తుందని, మనమంతా మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా, ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న అన్ని బతుకమ్మ వేడుకల్లో, చేనేతకు ప్రాధాన్యతనిస్తూ, చేనేత దుస్థలతో వేడుకలను జరువుపుకుంటే, చేనేత కుటుంబాల్లో గొప్ప భరోసా వస్తుందని తెలిపారు.

ఈ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్న టాక్ ప్రతినిధులు రాజ్ కుమార్, సుభాష్ కి మరియు జాగృతి నాయకుడు సంతోష్ రావు కొండపల్లి గారికి కృతఙ్ఞతలు తెలుపుతూ, అలాగే నేటి కార్యక్రమానికి సహకరించిన జాగృతి రాష్ట్ర నాయకులు శరత్ రావు, ప్రణీత్ రావు, నవీన్ ఆచారి, విజయ్ కోరబోయన, భిక్షపతి మరియు రోహిత్ రావు గార్లకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TAUK Dussera Batukamma posters are released by MP Kalvakuntla Kavita on September 13th at Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి