Assam Election Schedule: అస్సాం ఎన్నికల షెడ్యూల్ విడుదల-తేదీలివే..!
ఈశాన్య రాష్ట్రమైన అస్సాం (assam)లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ దీన్ని విడుదల చేశారు. దీని ప్రకారం ఏప్రిల్ 9న అస్సోం అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే మే 4న ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు విడుదల చేస్తామని సీఈసీ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వచ్చేసింది.
126 అసెంబ్లీ స్ధానాలున్న అస్సాంలో ఈసారి ఎన్నికల ప్రక్రియ మార్చి 16 నుంచి ప్రారంభం కాబోతోంది. మార్చి 16న పోటీ చేస్తున్న అభ్యర్ధుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈ నెల 23 వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.. అనంతరం మార్చి 24న నామినేషన్ల పరిశీలన చేస్తారు. తర్వాత మార్చి 26న నామినేషన్ల ఉపసంహరణకు అభ్యర్ధులకు గడువు ఇచ్చారు. ఏప్రిల్ 9న రాష్ట్రంలో పోలింగ్ నిర్వహిస్తారు. మే 4 ఫలితాల ప్రకటన ఉంటుంది.

ఈశాన్య రాష్ట్రం కావడంతో సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఇక్కడ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు విపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇప్పటివరకూ వెలువడిన సర్వే అంచనాల ప్రకారం ఇక్కడ బీజేపీకి మొగ్గు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications