వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటీష్ పార్లమెంట్‌లో టీఎస్ 2ఆవిర్భావ దినోత్సవం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

లండన్: తెలంగాణా ఎన్నారై ఫోరం(టిఈఎన్ఎఫ్) ఆధ్వర్యంలో లండన్‌లోని బ్రిటీష్ పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర రెండవ ఆవిర్భావ దినోత్స వేడుకలు, తెలంగాణ ఎన్నారై ఫోరం 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా స్థానిక బ్రిటన్ ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా, రూప హక్, ఇండియన్ హై కమిషన్ ప్రతినిధి ఆశీష్ శర్మ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుండి ప్రవాస తెలంగాణ బిడ్డలు, ఇతర ప్రవాస సంఘాల ప్రతినిధులు విచ్చేశారు.

ఈవెంట్స్ ఇన్‌ఛార్జ్ నగేష్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన కార్యక్రమంలో ముందుగా తెలంగాణ అమరవీరులకి, ప్రొ. జయశంకర్ సార్‌కు నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రీయ గీతం 'జయ జయ హే తెలంగాణా' తో కార్యక్రమం ముందుకు సాగింది.

ఈ సందర్భంగా ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజాయాలతో కూడిన వీడియోని ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల తెలంగాణ ఐటి మంత్రి కెటి రామారావు హైదరాబాద్‌లో ఆపిల్ సంస్థ డెవెలప్‌మెంట్ సెంటర్ ఆవిర్భావం సందర్భంగా చేసిన ప్రసంగాన్ని హాజరైన అతిథులంతా ప్రశంసించడం విశేషం.

బ్రిటన్ ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ .. తెలంగాణ సంస్కృతి ని ప్రపంచానికి చాటి చెప్పటమే కాకుండా, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికల్లో పరిచయం చేయడానికి తెలంగాణ ఎన్నారై ఫోరం చేస్తున్న కృషి చాలా గొప్పగా ఉందని అన్నారు. ఖండాంతరాల్లో ఉన్నప్పటికీ ప్రవాస బారతీయులుగా మనమంతా కలిసి మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని అన్నారు.

బ్రిటన్ ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొనడం సంతోషంగా ఉందని, కొత్త రాష్ట్రం అయినప్పటికీ బారతదేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఎన్నారై ఫోరం బాధ్యత గల తెలంగాణా సంస్థగా యూకేలో చేస్తున్న ప్రతి కార్యక్రమం గొప్పగా నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు.

ఎంపీ రూప హక్ మాట్లాడుతూ.. ఒక ప్రవాస తెలంగాణ సంస్థగా తెలంగాణా ఎన్నారై ఫోరం కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా, రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు బాధ్యత నిర్వహించడం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం చాలా స్ఫూర్తినిస్తుందన్నారు.

భారత హై కమిషన్ ప్రతినిధి ఆశీష్ పటేల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత యూకేలో ఎన్నో ప్రవాస తెలంగాణ సంస్థల నుండి నేడు మాకు వివిధ కార్యక్రమాల ఆహ్వానాలు అందుతున్నాయని అన్నారు. కానీ, ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ తెలంగాణా ఎన్నారై ఫోరం ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసి మాకిచ్చిన పిటీషన్లు ఎక్కువ అని, రాష్ట్ర ఆవిర్భావంలో వీరి క్రియాశీలక పాత్ర గొప్పదని ప్రశంసించారు.

అభివృద్దిలో భారత దేశంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని తెలిపారు. తెలంగాణా ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యులు, ఎన్నారై టిఆర్ఎస్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. ముందుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణా బిడ్డలకు, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాంక్షలు తెలిపారు.

ఉద్యమ సమయంలో లండన్ వీధుల్లో 'జై తెలంగాణ' అంటూ ఎన్నో పోరాటాలు చేసిన తాము, ఈరోజు చారిత్రాత్మక బ్రిటిష్ పార్లమెంట్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఎన్నో త్యాగాలతో సాధించిన రాష్ట్రానికి ఒక నాటి ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయి, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణా వైపు తీసుకెళ్తున్న తీరు గొప్పగా ఉందని కె చంద్రశేఖర్ రావును ప్రశంసించారు.

రెండు సంవత్సరాల్లో వివిధ శాఖల్లో జరిగిన అభివృద్దిని వీడియో రూపంలో ప్రదర్శించి సభకు వివరించారు. బాధ్యత గల సంస్థగా తెలంగాణ ఎన్నారై ఫోరం కేవలం సంబరాలకు మాత్రమే పరిమితం కాకుండా, నాటి ఉద్యం నుండి నేటి పునర్నిర్మాణం వరకు చేస్తున్న ప్రతి కార్యక్రమానికి సహకరించి భాగస్వాములైన సభ్యులకు, ఇతర మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యులు, ఎన్నారై టిఆర్ఎస్ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, అధ్యక్షులు సిక్క చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులు పవిత్ర రెడ్డి కంది, ఇవెంట్స్ ఇన్‌ఛార్జ్ నగేష్ రెడ్డి కాసర్ల, హెడ్ ఆఫ్ అడ్వైసరీ బోర్డ్ ఉదయ్ నాగరాజు, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి రత్నాకర్ కడుదుల, కల్చరల్ సెక్రటరీ శ్వేతా రెడ్డి , సభ్యులు గొలి తిరుపతి, నవీన్ రెడ్డి, ప్రమోద్ అంతటి, వెంకట్ రెడ్డి, నరేశ్ కుమార్, స్వాతి, రేకుల విక్రమ్ రెడ్డి, సత్య, రాజేష్ వర్మ, శ్రీకాంత్ జెల్ల, స్వామి ఆశ, సురేష్,శ్రీనివాస్, వర్ల్డ్ తమిళ్ సంఘం అధ్యక్షుడు జేకబ్ రవిబాలన్, తెలంగాణ ఐటి జాక్ ఛైర్మన్ వెంకట్ రెడ్డి, జెట్ యూకే ప్రెసిడెంట్ విష్ణు వర్ధన్ రెడ్డి, సీనియర్ తెలుగు టీవీ నటి ప్రీతి నిగమ్ (కుటుంబ సభ్యులతో), తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు సిక్క చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈరోజు తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంతో పాటు సంస్థ 4 వ వార్షికోత్సవం బ్రిటిష్
పార్లమెంట్‌లో జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ముందుగా 4 సంవత్సరాల్లో సంస్థ చేసిన కార్యక్రమాల వీడియోని సభకు ప్రదర్శించి వివరించారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ప్రపంచ వ్యాప్తంగా ఎవరు కూడా తెలంగాణా ఎన్నారై ఫోరంలా క్రియాశీలకంగా
రోడ్డుపై వచ్చి తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చెయ్యలేదని, ఆ ఘనత గౌరవం కేవలం యూకేలో నివసించే ప్రవాస తెలంగాణ బిడ్డలకే దక్కుతుందని తెలిపారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ పునర్నిర్మాణంలో బాగంగా ఇదే పార్లమెంట్‌లో తెలంగాణా ఎంపీలతో, ఇతర ప్రభుత్వ ప్రతినిధులతో బిజినెస్ మీట్‌లు నిర్వహించామని, క్షేత్ర స్థాయిలో తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలు చేశామని తెలిపారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

చివరిగా, హాజరైన అతిథులు, సభ్యుల తో రెండు సంవత్సరాల తెలంగాణ
రాష్ట్ర స్వయం పాలనపై చర్చ నిర్వహించారు తర్వాత పార్లమెంట్ ఆవరణలో
సభ్యులంతా కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా స్థానిక బ్రిటన్ ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా, రూప హక్, ఇండియన్ హై కమిషన్ ప్రతినిధి ఆశీష్ శర్మ హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుండి ప్రవాస తెలంగాణ బిడ్డలు, ఇతర ప్రవాస సంఘాల ప్రతినిధులు విచ్చేశారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఈవెంట్స్ ఇన్‌ఛార్జ్ నగేష్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన కార్యక్రమంలో
ముందుగా తెలంగాణ అమరవీరులకి, ప్రొ. జయశంకర్ సార్‌కు నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రీయ గీతం ‘జయ జయ హే తెలంగాణా' తో కార్యక్రమం ముందుకు సాగింది.

English summary
Telangana formation day celebrations held at britain parliament in London.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X