TANA: జులైలో తానా మహాసభలు.. సన్నాహాక సమావేశానికి భారీ స్పందన..
ఏపీ, తెలంగాణ నుంచి చాలా మంది విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. ముఖ్యంగా తెలుగువారు అమెరికాలో ఎక్కువగా స్థిరపడ్డారు. ఇక్కడ వారు ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే ఉత్తర అమెరికా తెలుగు సంఘం(TANA). ఈ సంఘం వారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తమ సంస్కృతిని, సంప్రదాయాలను గుర్తుకు తెచ్చే విధంగా సంబరాలు చేసుకుంటారు. తానా మహాసభలు నిర్వహిస్తూ అమెరికాలోని తెలుగువారిని ఒక్క దగ్గరికి తీసుకొస్తుంటారు.
ఈసారి కూడా తానా మహాసభలు ఘనంగా నిర్వహించనున్నారు. జులైలో నిర్వహించే 23వ తానా మహాసభలకు సంబంధించి సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలు నిర్వహించేందుకు తానా ఫండ్ రైసింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా న్యూజెర్సీలోని చేపట్టిన ఫండ్ రైసింగ్ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. తెలుగు వారు పెద్ద మొత్తం డబ్బులు అందించారు. తెలుగువారితో ఎడిసన్ లోని రాయల్ అల్బెర్ట్స్ పాలస్ అంతటా సందడి వాతావరణం నెలకొంది. పెద్దలు, మహిళలు, పిల్లలతో ప్రాంగణం నిండిపోయింది.

ఈ సందర్భంగా ఇటీవల మరణించిన ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ కు నివాళులు అర్పించారు. సినీనటుడు నందమూరి తారక రత్నకు కూడా ఘనంగా నివాళి అర్పించారు. జులై 7,8,9 తేదీల్లో తానా మహాసభలు నిర్వహించనున్నారు. 23వ తానా మహాసభలకు రవి పొట్లూరి సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు.












Click it and Unblock the Notifications