ఎరవేసి ఇరుక్కుపోయిన మహిళ, ఏడుసార్లు ఫెయిలై.. ఎనిమిదోసారి, ఏం చేసిందంటే..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని షార్జా నగరంలో ఓ మహిళ(30) డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలో విఫలమైంది. ఒక్కసారి, రెండుసార్లు కాదు... ఏకంగా ఏడుసార్లు ఇదే పరిస్థితి. దీంతో ఇక తాను డ్రైవింగ్ లైసెన్స్ పొందలేననే ఆం
షార్జా: గల్ఫ్ దేశాల్లో లంచం తీసుకున్నా, ఇచ్చినా నేరమే. పట్టుబడిన వారికి తీవ్రమైన శిక్షలు ఉంటాయి. లంచం ఇచ్చినట్లు తేలితే కఠిన శిక్ష పడుతుందని తెలిసినా ఓ అధికారికి లంచం ఇవ్వచూపింది ఓ మహిళ.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని షార్జా నగరంలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఓ మహిళ(30) డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలో విఫలమైంది. ఒక్కసారి, రెండుసార్లు కాదు... ఏకంగా ఏడుసార్లు ఇదే పరిస్థితి.

దీంతో ఇక తాను డ్రైవింగ్ లైసెన్స్ పొందలేననే ఆందోళనతో ఆ శాఖలోని ఓ అధికారికి లంచం ఇవ్వాలని నిర్ణయించుకుంది. తనకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే ఓ చాక్లెట్ లంచంగా ఇస్తానని ఆశచూపింది.
కేవలం చాక్లెట్ మాత్రమే కాదులెండి.. ఆ చాక్లెట్‌తోపాటు 500 దిర్హమ్స్ ( మన కరెన్సీలో దాదాపు రూ.8,900)లు ఇస్తానంటూ చెప్పింది. ఆమె ప్రతిపాదనకు భయపడిన సదరు అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయాన్ని పూసగుచ్చినట్టు వివరించాడు.
దీంతో అక్కడి పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై కోర్టులో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అయితే విచారణలో నిందితురాలు కొత్తవాదనను తెరపైకి తీసుకొచ్చింది.
తాను బహుమతిగా ఇస్తానని అన్నానని, తనను ఆ అధికారి తప్పుగా అర్థం చేసుకున్నారని, లంచం ఇవ్వడం తన ఉద్దేశ్యం కాదని పేర్కొంది. ఆసక్తికరమైన ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. నేరం రుజువైతే నిందితురాలికి కఠిన శిక్ష పడడం ఖాయం.












Click it and Unblock the Notifications