Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్టార్టప్ నుండి స్టార్డమ్‌ వరకు.. ముండ్రు ఫణీంద్ర

"జీవితం అంటే అవకాశాలు రావడం కాదు, వాటిని సృష్టించుకోవడం"
ఈ మాటలకు సజీవ సాక్ష్యం ముండ్రు ఫణీంద్ర.

సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక సాధారణ యువకుడు, స్వంత కలలతో, కుటుంబం ఇచ్చిన బలంతో, తన కృషిని ఆయుధంగా చేసుకుని, నేడు మూడు విభిన్న రంగాల్లో అగ్రస్థానంలో నిలిచారు. టెక్నాలజీ, మీడియా కార్పోరేట్ లీడర్ గా, ఆటోమొబైల్ రంగాలలో సమానంగా తన ముద్ర వేసిన ఫణీంద్ర, కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు ;పెట్టుబడిదారు, కార్పొరేట్ లీడర్‌ గానూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.


1990 సెప్టెంబర్ 19న జన్మించిన ఫణీంద్ర, చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, విద్య, నిజాయితీ విలువలతో పెరిగారు. తల్లిదండ్రులు ముండ్రు అబ్రహం, ముండ్రు మణి ఇచ్చిన మార్గదర్శకత్వం, సోదరి రమ్య అందించిన సహకారం, ఆయన విజయయాత్రలో ప్రముఖమైనవి. కుటుంబం ఇచ్చిన ఈ బలమే, భవిష్యత్తులో ఎంతటి సవాళ్లు వచ్చినా ఎదుర్కోవడానికి ఆయన్ను సిద్ధం చేసింది.

ఫణీంద్ర విద్యా ప్రస్థానం సాధారణ విద్యార్థిలా కాకుండా, ఏదో సాధించాలన్న తపనతో సాగింది. ఇంజినీరింగ్‌లో రెండో సంవత్సరం నుంచే ఆఫ్‌లైన్ ప్రాజెక్టులు, డిజైన్ పనులు చేయడం పట్ల దృష్టి సారించారు. విద్యా కాలంలోనే పొందిన ఈ అనుభవం, తర్వాత 'థేనిసా సాఫ్ట్ వేర్ సొల్యుషన్స్ ప్రైవేట్ లిమిటెడ్' స్థాపనకు బలమైన పునాది అయింది. కేవలం చదువు కోణంలోనే కాకుండా, టెక్నికల్ నైపుణ్యం, మార్కెట్ అవసరాలు, కస్టమర్ అంచనాలు అన్నీ అర్థం చేసుకునే సామర్థ్యం ఫణీంద్రకు ఆ దశలోనే అలవడింది. ఇంజినీరింగ్ పూర్తి చేసే సమయానికి, భవిష్యత్తులో తనదైన సంస్థను నిర్మించాలనే సంకల్పం కూడా దృఢపడింది. ఆ సంకల్పమే తర్వాత 11 ఏళ్ల పాటు నిరంతర కృషి చేసి 'థేనిసా'ని బలమైన స్థాయికి తీసుకెళ్లే దిక్సూచి అయ్యింది.

ఈ సంస్థను స్థాపించడానికి ఆయన చేసిన కృషి సాధారణమైనది కాదు. ఇంజినీరింగ్ రోజుల్లోనే ప్రారంభమైన ఆలోచన, తర్వాత 11 సంవత్సరాల పాటు నిరంతర శ్రమ, కొత్త సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవడం, కస్టమర్ అవసరాలపై లోతైన పరిశోధన, మరియు వ్యూహాత్మక ప్రణాళికలతో ఈ సంస్థ రూపుదిద్దుకుంది.

థేనిసా సంస్థ ప్రత్యేకత ఏమిటంటే, ఇది 24/7 టెక్నికల్ సపోర్ట్ అందించడంలో ముందంజలో ఉండటం. క్లయింట్లు ఎప్పుడు అవసరం వచ్చినా, సమస్యలను పరిష్కరించే సత్తా ఉన్న బృందాన్ని ఆయన తీర్చిదిద్దారు. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్‌ లో నాణ్యత, సమయపాలన, కస్టమర్ సంతృప్తి ఆయనకు అత్యంత ప్రాధాన్యం. అంతేకాకుండా, ఈ సంస్థ కేవలం సాంకేతిక పరిష్కారాలు అందించే సంస్థ మాత్రమే కాదు ,ఇది తన సిబ్బందికి ఒక నేర్చుకునే వేదిక, పరిశోధనలకు ప్రోత్సాహం ఇచ్చే స్థలం. ఫణీంద్ర నాయకత్వంలో, ఈ సంస్థ దేశీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తన గుర్తింపును సాధించింది.

టెక్నాలజీ రంగంలోనే కాకుండా, ఆటోమొబైల్ రంగంలో కూడా తన ముద్ర వేయాలన్న ఆలోచనతో, ఫణీంద్ర తన భార్య స్రవంతితో కలిసి అబిగాలి ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించారు. ఇది కేవలం వ్యాపార విస్తరణ మాత్రమే కాదు, ఇద్దరూ కలిసి నిర్వహిస్తున్న ఒక కమిట్మెంట్ కూడా .ఆటోమొబైల్ రంగంలో నాణ్యత, సర్వీస్, మరియు కస్టమర్ సంతృప్తి ప్రధానమైనవి. ఫణీంద్ర, స్రవంతి ఈ అంశాలను వ్యాపారం మొదటి రోజునుంచే అతి పెద్ద ప్రాధాన్యంగా తీసుకున్నారు.

ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ మార్పులు, కస్టమర్ ప్రాధాన్యతలు వేగంగా మారుతున్నా, వీరిద్దరూ వాటిని అర్థం చేసుకుని వ్యూహాలను అనుసరిస్తూ ఈ పోటిలో నిలబడుతూ ముందుకు సాగుతున్నారు. ఈ సంస్థ పేరు వారి కుమార్తె అబిగైల్ పేరుతో పెట్టడం, కుటుంబానుబంధాన్ని వ్యాపారంతో మిళితం చేసిన ఒక చిహ్నం. ఇదే విషయం ఈ వ్యాపారాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది.

"నా విజయానికి వెనుక ఉన్న బలం నా కుటుంబమే" ఫణీంద్ర ఎప్పుడూ చెప్పే మాట. తల్లిదండ్రులు ముండ్రు అబ్రహాం మరియు ముండ్రు మణి చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, కష్టపడి పని చేయడం, నిజాయితీ వంటి విలువలు నేర్పించారు. భార్య స్రవంతి వ్యాపారంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఆయనకు అండగా ఉంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు అబిగైల్ ,మాల్విన్ అబ్రహాం.

టెక్నాలజీ రంగం, ఆటోమొబైల్ రంగం రెండూ వేర్వేరు ప్రపంచాలు. ఒక దాంట్లో కొత్త ఆవిష్కరణలు, వేగం ముఖ్యం; మరొక దాంట్లో కస్టమర్ అనుభవం, విశ్వాసం ప్రాధాన్యం. కానీ ఫణీంద్ర ఈ రెండింటినీ సమానంగా నడిపిస్తూ, వ్యాపార విజయానికి సమతుల్యం ఎలా సాధించాలో చూపిస్తున్నారు. ఫణీంద్ర భవిష్యత్తు లక్ష్యం తన రెండు సంస్థలను అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించడం. అలాగే, కొత్త రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడం, మరియు సాంకేతికతతో పాటు మానవ విలువలను కాపాడే వ్యాపార నమూనాలను ఏర్పాటు చేయడం.

From Middle-Class Roots to Industry Leader Phanindra s Rise in Tech Media and Auto Sectors

వృత్తి పరంగా ఎంత బిజీగా ఉన్నా కుటుంబాన్ని, విలువలను, ముందుంచే ఫణీంద్ర ధోరణి, ఈ తరానికి ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. టెక్నాలజీ, ఆటోమొబైల్ అనే రెండు విభిన్న రంగాల్లో సమతుల్యంగా విజయం సాధించడం, వ్యాపార దిశలో ముందుకు సాగదలచిన ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం ఫణీంద్ర జీవితం. "స్వప్నాలను నమ్మి కష్టపడి ముందుకు సాగితే, సాధ్యంకానిదేమి ఉండదు" అన్నదానికి నిదర్శనం ఫణీంద్ర.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+