బ్లూఫిలిం చూడాలని చిన్నారులకు ఉపాధ్యాయుడి ఫోర్స్

Teacher forces girls to watch porn, beaten
రాయపూర్: ఓ ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయుడు ఐదో తరగతి విద్యార్థినులను బ్లూ ఫిలిమ్స్ చూడాలని బలవంతం చేసిన సంఘటన చత్తీస్‍గఢ్‌లో చోటు చేసుకుంది. జంజీర్ జిల్లాలోని అకల్తారా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడు ఆ ఘటన తర్వాత పారిపోయాడు. పోలీసులు ఆదివారం తెలిపిన వివరాలు ప్రకారం... నిందితుడుకి ఇరవయ్యారు ఏళ్లు. ఐదో తరగతి విద్యార్థినులను ఎవరూ లేని ఓ గదిలోకి తీసుకు వెళ్లి తన లాప్ టాప్‌లో బ్లూ ఫిలిమ్స్ చూడమని బలవంతం చేశాడు. బలవంతంగా తమతో ఆ చిత్రాలు చూపిస్తుండటంతో వారు అరిచారు.

వారు తనను అడ్డుకోవడంతో బెదిరిపోయిన ఉపాధ్యాయుడు తాను ఇలా చేసిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని వారించి వారిని పంపించాడు. ఏ ఉపాధ్యాయుడికి గానీ తల్లిదండ్రులకు గానీ చెప్పవద్దని వారిని హెచ్చరించాడు. అయినప్పటికీ విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పారు. దీంతో ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు శనివారం రాత్రి సదరు ఉపాధ్యాయుడిని పట్టుకొని చితకబాదారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చేలోగా అతను పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+