LuLu Mall offers:లులు ఆన్ సేల్ లో భారీ ఆఫర్లు..పలు వస్తువులపై 50 శాతం తగ్గింపు..!!
హైదరాబాద్ లులు మాల్ షాపింగ్ ప్రియుల కోసం అదిరిపోయే ఆఫర్లు, కళ్లు చెదిరే డిస్కౌంట్లు అందించనుంది. ఇందుకోసం ''లులు ఆన్ సేల్" పేరిట మెగా సేల్ నిర్వహించనుంది. ఈనెల 3 నుంచి 6వ తేదీ వరకు... 4 రోజుల పాటు ఇది జరగనుండగా.. ఇందులో సందర్శకులకు, షాపర్లకు భారీగా ఆఫర్లు ఇస్తోంది. దీనికి సంబంధించిన లోగోను మాల్ నిర్వహకులు మంగళవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ విమేష్ మాట్లాడుతూ.. మూడో తేదీ నుంచి ఆరో తేదీ వరకు 4 రోజుల పాటు లులు హైపర్ మార్కెట్, ఫ్యాషన్ స్టోర్, లులు కనెక్ట్ (ఎలక్ట్రానిక్స్) విభాగాల్లో 200 బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లు ఉంటాయన్నారు. నూతన వస్త్రాలు, యాక్ససరీస్, బ్యాగులు, ఫుట్ వేర్, స్పోర్ట్స్ వేర్ లాంటి వాటిపై 50 శాతం దాకా తగ్గింపు.. లులు కనెక్ట్ లో టీవీలు, ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, గృహోపకరణాపై ప్రత్యేక డీల్స్ లభిస్తాయని తెలిపారు. షాపర్ల కోసం ఉదయం 8 గంటల నుంచే హైపర్ మార్కెట్ ప్రవేశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. హైపర్ మార్కెట్ లో ప్రతి గంటకూ ప్రత్యేక డీల్స్ ఉంటాయని తెలిపారు.

మాల్ మేనేజర్ ఎడిల్ అరసన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర ప్రజలకు భారీగా ఆఫర్లు అందించేందుకు ఈ లులు ఆన్ సేల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫుడ్ కోర్ట్ తో సహా.. 80కి పైగా స్టోర్లు ఇందులో పాల్గొంటున్నాయని వివరించారు. మరోవైపు "ఎండ్ ఆఫ్ సీజన్ సేల్" కూడా నడుస్తున్నట్లు చెప్పారు. జులై 20 వరకు ఈ సేల్ కొనసాగుతుందని.. ఇందులో సైతం పలు ప్రీమియం బ్రాండ్స్, ఎలక్ట్రానిక్స్, తదితర వస్తువులపై 50 శాతం వరకు డిస్కౌంట్స్ ఉంటాయన్నారు. ఇక రాష్ట్రంలోనే అతిపెద్ద ఇండోర్ గేమ్ జోన్ అయిన లులు ఫంటూర సైతం.. గేమింగ్ ప్రియులు, చిన్న పిల్లల కోసం ప్రత్యేక ఆఫర్లు అందించనున్నట్లు వెల్లడించారు.

ఆకర్షణీయ బహుమతులు..
"లులు గ్రాండ్ షాపింగ్ కార్నివల్-2025" లో ప్రత్యేక బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందని రీజినల్ డైరెక్టర్ అబ్దుల్ ఖాదీర్ షేక్ తెలిపారు. కనీసం రూ.1999 విలువైన షాపింగ్ చేసిన వాళ్లు.. 2 జావా బైకులు, 2 టీవీఎస్ స్కూటీలు, గోల్డ్ కాయిన్స్ గెలుచుకోవడంతో పాటు దుబాయ్ ట్రిప్ కు వెళ్లే అవకాశాన్ని పొందుకోవచ్చన్నారు. లక్కీ డ్రా ద్వారా విజేతలను నిర్ణయిస్తారని తెలిపారు.












Click it and Unblock the Notifications