• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొత్త చూపు కోసం తపనే 'తోవ ఎక్కడ'

By Pratap
|
Sunkireddy Narayana Reddy
ప్రత్యామ్నాయ రాజకీయోధ్యమ నిర్మాణానికి, ఆచరణకు ప్రత్యామ్నాయ సాంస్కృతికోధ్యమం కావాలి. సాంస్కృతికోద్యమం బలంగా పని చేస్తూ భావ విప్లవానికి తోడ్పడాలి తద్వారా రాజకీయోద్యమం సాగుతుంది. ఈ రాజకీయోద్యమం నిరంతరం ఆత్మ విమర్శతో లోటుపాట్లను వైఫల్యాలలను సరిదిద్దుకుంటూ విస్తృతం కావాలి. ఆచరణలోనే కాదు తాత్వికరంగంలో కూడా ఈ పని నిరంతరం జరగాఆలి ఇదంతా జరగపకోవడమే ఇక్కడి విప్లవోద్యమాల వైఫల్యమైతే ప్రశ్న ఎక్కడో ఒక చోట పుడుతుంది. సుంకిరెడ్డి నారాయణరెడ్డి ''తోవ ఎక్కడ'' అని అడగాల్సిన స్థితి అందుకే వచ్చింది. ''విశ్వంలోని ప్రతి అణువుకూ స్వరముంది. కేంద్రీకృత స్వరమే కవి'' చాలామంది తరపున కేంద్రీకృత స్వరమై సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ''తోవ ఎక్కడ'' అనే ప్రవ్నను సంధించాడు. '' దిగంబర కవిత్వం, 1980కి ముందు నాటి విప్లవ కవిత్వం ప్రవేశపెట్టిన కవితా నిర్మాణ పద్దతుల కొనసాగింపు పరిణతి తోవ ఎక్కడలో కనిపిస్తాయి ''అని'' కవిత్వంలో కొత్త తోవ'' ఆనే శీర్షికతో ''తోవ ఎక్కడ'' కవితా సంకలనానికి రాసిన ముందు మాటలో ఎ.సురేంద్రరాజు అభిప్రాయపడ్డారు.

సుంకిరెడ్డి నారాయణరెడ్డి కవితాస్వరం కూడా అక్కడే ఉంది. ఆభ్యుధయ కవిత్వం నీరసపడింది. ప్రస్తుతం విప్లవ కవిత్వం నగిషీల మధ్య, 'నటన'ల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. దీనికి విప్లవోద్యమాల తాత్విక వెసుకబాటే కారణం. ఈ వెనకబాటుతనానికి ప్రత్యామ్నాయం చూపిస్తూ తోవను పరుస్తూ పోవాలి. అది జరగలేదు. అది జరగకపోవడం కవిత్వంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. గత పదేళ్లుగా విప్లవరాజకీయోద్యమాలు బావిలోకి దిగాక ఈదాక తప్పదనే పద్ధతిలో నడుస్తున్న తీరు విప్లవ కాల్పనికులు సాంతానికి వాడుకుంటే విప్లవ కాల్పనికుల రూపాన్ని విరసం సొంతం చేసుకుంది'' అందుకే ''నటన''లకు ''నగిషి''లు చెక్కి విప్లవోద్యమాలను కీర్తిస్తూ కాల్పనిక నిబద్దతను మాత్రమే కవులు ప్రకటిస్తూ వస్తున్నారు. అందువల్లనే విరసంవెలుపల ఉన్న కవులే ప్రతిభావంతులైన విప్లవ కవులుగా ప్రశంసలందుకుంటూ వస్తున్నారు. బహుశ విప్లవోద్యమాలపై, వాటిని ప్రతిఫలిస్తున్న విప్లవ సాహిత్యోద్యమాలపై, వాటిని ప్రతిఫలిస్తున్న విప్లవ సామిత్యోద్యమంపై అసంతృప్తి పదేళ్ళకిందటే మొదలయిందనడానికి సుంకిరెడ్డి నారాయణరెడ్డి కవిత్వమే నిదర్శనం, ఆయన 1980లో విప్లవోద్యమాలపై ఆశావాదంతో...

'' అప్పుడప్పుడు

ఈ బాటకాళి అవడం క్రియానంతర స్థితికాదు

క్రియా పూర్వస్థితికాదు

క్రియా పూర్వస్థితి

లాకులెత్తబోయేముందు

కాల్వ అనుభవించే స్థితి'' (స్థితి) అని అన్నారు.

ఆశావాదం కూడా నశించడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆశ నిరాశే అని తెలీయడంతో ఆ స్థానే అసంతృప్తి చోటు చేసుకుంది.అందుకే ప్రశ్నలు సంధించాడు. ప్రత్యామ్నాయ రాజకీయోద్యమాలు, పార్లమెంటరీ రాజకీయాల మాదిరిగానే ప్రశ్నించడాన్ని మరోరకంగా నిషేదించాయి. ప్రశ్నలు శత్రువుకు ఉపయోగపడతాయనే 'కాటిల్య నీతి''ని పోషించాయి. అందుకే చాలామంది ప్రశ్నలను అంతరంగాల్లోనే సమాధి చేస్తూ విస్తున్నారు. ఈ తప్పిదం ప్రత్యామ్నాయ రాజకీయోద్యమాలకు కలిగించిన నష్టం ఒకసారి ఆత్మావలోకనం చేసుకుంటే అర్థమవుతుంది. అయితే ప్రశ్నించకుండా ఉండలేని స్థితికి ఆ ఉద్యమాలేకారణం. ఈ పరిస్థితిలోనే సుంకిరెడ్డి నారాయణరెడ్డి ''తోవ ఎక్కడ'' అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు స్పష్టమైన నేపథ్యం అందించిన ఆయన 1993 జూన్‌-1994 జనవరి మధ్యకాలంలో రాసిన 'తర్జని' తోవ ఎక్క అని ప్రశ్నించిన సుంకిరెడ్డి నారాయణ రెడ్డి 'తర్జని' కవితలో

''ఎటు చూసినా సూర్యుళ్ళే

కావయితే ఎటు పాదం కదిపినా చీకటే''

అంటూ దీనికి కారణం అన్వేషిద్దామంటాడు-

''స్పందనలో అవస్వరాలున్నాయేమో గుండెను విప్పి చుద్దామా?

ఇక అడుగు ఆలస్యమైనా సరే ప్రతి అడుగునూ ప్రశ్నలా లేపుదామా?'' - అని అన్నాడు కవి. ఈ కవితలోనే విప్లవోద్యమ వెనుకబాటు తనానికి నేటి నిర్మాణ, ఆచరణ పరిధిలోనే పరిష్కారం చూపే ప్రయత్నం చేశాడు. అందుకే ''పలు పార్శ్వాలున్న ఆస్త్రం నేటి అవసరం'' అని చెప్పాడు. '' ఊరి బయటి దు:ఖాలకు గొంతునిచ్చిందా మన సూర్యగీతం?'' అని ప్రశ్నిస్తూ దభ్యుదయ కవిత్వం నీరసపడిన థలో ఉన్న పరిస్థితే నేడుంది. ప్రస్తుతం విప్లవ కవిత్వం నగిషీల మధ్య 'నటన'ల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. దీనికి విప్లవోద్యమాల తాత్విక వెనుకబాటే కారణం ఈ వెనుక బాటు తనం నేపథ్యం నుంచే, విప్లవోద్యమాలు విస్మరించిన అంశాల పునాదుల్లోంచే దళిత కవిత్వం, ఎదురైన ప్రతిసారీ '' మన వేదాల్లో ఉన్నాయష'' అనే మాదిరిగా ఆ అంశాలను'' మేం ఇదివరకే చెప్పాం'' అనే ధోరణి విప్లవ రాజకీయ సాంస్కృతికోద్యమాల్లో కూడా చచేసుకుంది. మొత్తంగా విప్లవ రాజకీయోద్యమాలు ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నా అని అక్కడే ఉన్నాయి. అందుకే-

రథాన్ని వదిలి అశ్వం పరుగెత్తడం-

నీ పోరాటం

ఒంటరిగా పరుగెత్తడం ఆపి

పరికించి చూడు-గమ్యం మారిపోయింది

నీ దారి ఇరుకైపోయింది

దాటి వచ్చినా యోజనాల్ని లెక్కించు

తిరిగిన చోటే తిరగడమైంది ''(డైమెన్షన్స్‌)

అంటున్నాడు సుంకిరెడ్డి

వర్గచ్ఛేదనలోని హింస

రేపటి కొత్త ప్రవహానికి

క్షీరాన్నందిస్తుందిరా!'' (సహజం)

అనే విశ్వాసం సుంకిరెడ్డి నారాయణరెడ్డికి ఉంది అందుకే విప్లవోద్యమాన్ని విప్లవ కవితోద్యమాన్ని ప్రశ్నించే బాధ్యత కూడా ఆయన మోస్తున్నాడు. నిజాయితీగా ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సిన బాద్యత ఉద్యమాలక ఉంది. అయితే 'సమాధానాలు గైడుబుక్కులవుతున్నాయ''ని కూడా ఆయనకు ఆసంతృప్తి ఉంది. అలా అవుతున్నప్పుడు '' సరికొత్త ప్రశ్నలమై అవతరించాలంటాడు సుంకిరెడ్డి విప్లవోద్యమాలు ప్రత్యామ్నాయాలు చూపలేకపోయాయి. ప్రతి అంశా................................................అని అన్నాడు ఆశావాదం కూడా నశించడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆశ నిరాశే అని తెలీయడంతో ఆ స్థానే అసంతృప్తి చోటు చేసుకుంది. దీనికి ఉదహరణే-

'' ఇవాళ

కత్తి బరువు మోసే బలం మాత్రమే కాదు

ఆయుధం ఆట తెలిసిన వేటగాడి నేర్పుకావాలి

అడవి ఆయుధంగా పదునుదేరుతూనే ఉన్నా

ఆయుధాన్ని ధరించలేని ఆశక్తులుగానే ఉన్నాం'' (మనలోకి)

అనే కవిత ఇదే అసంతృప్తి సుంకిరెడ్డి నారాయణరెడ్డి పలు కవితల్లో విస్తరించింది. ఆ తర్వాత 'గమ్యం' నిర్ధిష్టమే అయినా గమనం కోసం దారి సరిగా లేదనే విషయాన్ని కవి గుర్తించాడు. అందుకే ''తోవ ఎక్కడ'' అని స్ప................... నిర్మాణ ఆచరణ పరిధిలోనే పరిష్కారం చూపే ప్రయత్నం చేశాడు.

అందుకే ''పలు పార్శ్వాలున్న అస్త్రం నేటి అవసరం'' అని చేప్పాడు.''ఊరి బయటి దు:ఖాలకు గొంతునిచ్చిందా మన సూర్యగీతం?'' అని ప్రశ్నిస్తూదళితవాదాన్ని గుర్తించాల్సిన అవసరాన్ని గుర్తుచేశాడు. ప్రస్తుతం కొందమంది సాహితీ విమర్శకులు దళిత స్త్రీవాదాలను స్వీకరించి విప్లవోద్యమాలు వీటిని తప్పకుండా స్వీకరించాల్సిందే. అయితే ఇది మాత్రమే నేటి సమస్య కాదు. మొత్తంగా ఒక నిర్దిష్ట నిర్దుష్ట ప్రత్యామ్నాయ సంస్కృతి, దాని అచరణ రూపుదిద్దుకోలేని లోటు నేడు పీడిస్తున్నది. విప్లవ కమ్యూనిస్టు ఉద్యమాలకు మోడ్స్‌ లేని ప్రస్తుత వాతావరణంలో ఇక్కడి పరిస్థితులకు అనుకూలమైన విధానాన్ని రూపోందించుకోవాల్సింది. మొత్తంగా ఒక '' కొత్త చూపు'' కావాలి. ఆ కొత్త చూపును కవి సుంకిరెడ్డి నారాయణరెడ్డి స్పష్టంగా రూపుదిద్దలేకపోయారు. అయితే ఆ కొత్త చూపునకు కావాల్సిన అంచులనన్నింటినీ ఆయన స్కృశించాడు. మొత్తంగా ప్రత్యామ్నాయ సాంస్కృతిక రాజకీయోద్యమాల నిర్మాణానికి ఒక కొత్త దృష్టి కావాలనే నేటి పరిస్థితినే ఆయన ప్రతిబింబించారు. దానికి నిర్దిష్ట రూపం ఎలా ఉండాలనేది ఆయనకు స్పష్టంగా తెలిసి ఉండకపోవచ్చు అయితే '' కొన్ని సమాదానాలు కవితలో...

''ఇక పదమేదీ పరిమళించదిక్కడ

ఈ భాషను తిరుగరాస్తే తప్ప

ఇక మొక్కేదీ వికసించదిక్కడ

ఈ మట్టిని తిరిగేస్తే తప్ప''

అని నిర్దింష్టంగానే స్పష్టంగానే పలికాడు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ప్రస్తుతం ఈ బాధ్యతను రాజకీయోద్యమాలు నిర్వహించాల్సి ఉంది.

(1994లో రాసిన వ్యాసం ఇది)

- కాసుల ప్రతాపరెడ్డి

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Dr Sunkireddy Narayana Reddy has published a poetry collection Tova Ekkada? (where is the path), questioning the political philosophy of alternate politics in 1994.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more