జూకంటి కవిత: చెట్టు నా ఆత్మ

శాఖోపశాఖలుగా విస్తరించి
పరుచుకున్న నీడ
నేలలో కాళ్లను తొక్కిపట్టి
ఎండకు వానకు
విచ్చిన కొమ్మల గొడుగు పట్టుకు చెట్టు
ప్రాణవాయువు ఇచ్చే దాత
పక్షుల ఆవాసం వాస్తు నిర్మాత
పండ్లను ఇవ్వడమే తప్ప
తీసుకోవడం తెలియని
తల్లి మనుసులా తరువు
ఇటీవల వేర్లు ఇంటి పునాదులను పెకిలిస్తున్నాయని
చెట్టును కొట్టేశారు
ఇప్పుడు నన్ను నేను
పోగొట్టుకు వెతుక్కుంటున్నాను
పునాదులు పెకిలిస్తున్నాయని కొట్టేస్తే
ఇప్పుడు బతుకు కూలిపోతుంది
ఒట్జూ!
చెట్టు నా ఆత్మ
- జూకంటి జగన్నాథం












Click it and Unblock the Notifications