వన్‌ప్లస్ 13పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.35 వేలు ఆఫర్ !
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 రానున్న తరుణంలో.. వన్‌ప్లస్ అభిమానులకు ముందుగానే గుడ్ న్యూస్ వచ్చింది. ఫ్లాగ్‌షిప్ మోడల్ వన్‌ప్లస్ 13పై భారీ తగ్గింపు ఆఫర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్‌గా చెప్పవచ్చు.
భారీ డిస్కౌంట్..
వన్‌ప్లస్ 13 (12GB RAM + 256GB స్టోరేజ్) ధర రూ. 72,999 నుంచి రూ. 69,998కి తగ్గింది. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ధరను మరింత తగ్గించుకొని.. కేవలం రూ. 39,998కి ఈ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అదనంగా, అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 2,099 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, ఈ డీల్ ద్వారా కస్టమర్లు దాదాపు రూ. 30,000 పైగా ఆదా చేసుకోవచ్చు.

ఎక్స్ఛేంజ్ ప్రాసెస్ ?
ఈ ఆఫర్ పొందడానికి అమెజాన్‌లో వన్‌ప్లస్ 13 పేజీకి వెళ్లి, 'ఎక్స్ఛేంజ్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే, నిపుణులు దానిని అంచనా వేసి తగ్గింపు ధరను నిర్ధారిస్తారు. దీంతో తక్కువ ఖర్చుతో కొత్త ఫోన్ పొందడం సులభం అవుతుంది.
ONE PLUS 13 ఫీచర్స్..
డిస్‌ప్లే..
వన్‌ప్లస్ 13లో 6.82 అంగుళాల LTPO 4.1 AMOLED డిస్‌ప్లే అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. అధిక స్పష్టత, నేచురల్ కలర్స్, స్మూత్ స్క్రోలింగ్‌తో గేమింగ్, స్ట్రీమింగ్ అనుభవం మరింత రిచ్‌గా ఉంటుంది.
పనితీరు..
ఈ ఫోన్‌లో తాజా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, అడ్రినో 830 GPU ఉంది. ఇది హై-ఎండ్ గేమింగ్, మల్టీటాస్కింగ్, హేవీ అప్లికేషన్లను సులభంగా హ్యాండిల్ చేస్తుంది. ల్యాగ్ లేకుండా ఎల్లప్పుడూ ఫాస్ట్ పెర్ఫార్మెన్స్‌ను ఇస్తుంది.
కెమెరా..
వన్‌ప్లస్ 13లో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది:
50MP మెయిన్ కెమెరా (OISతో)
50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ - జూమ్ షాట్స్ కోసం
50MP అల్ట్రా వైడ్ లెన్స్ - 120 డిగ్రీల వ్యూకి
అలాగే, 32MP ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు, వీడియో కాల్స్ అత్యున్నత నాణ్యతలో ఉంటాయి. నైట్ ఫోటోగ్రఫీ, 8K వీడియో రికార్డింగ్, AI ఫీచర్స్ కూడా ఈ కెమెరా సెటప్ ప్రత్యేకత.
బ్యాటరీ & ఛార్జింగ్..
వన్‌ప్లస్ 13లో 6000mAh బ్యాటరీ ఉంది. ఇది 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 20 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ అవుతుంది. రోజంతా గేమింగ్, స్ట్రీమింగ్ చేసినా బ్యాటరీపై టెన్షన్ అవసరం ఉండదు.
అదనపు ఫీచర్లు..
5G కనెక్టివిటీ, Wi-Fi 7 సపోర్ట్
మెరుగైన హాప్టిక్ ఫీడ్‌బ్యాక్
IP68 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్
కొత్త OxygenOS 15 (Android 15 ఆధారిత)
ఫెస్టివల్ ఆఫర్ వివరాలు..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెప్టెంబర్ 23, 2025 నుంచి ప్రారంభం కానుంది. ప్రైమ్ మెంబర్స్‌కు ఆఫర్లు సెప్టెంబర్ 22 నుంచే అందుబాటులోకి వస్తాయి. అయితే, వన్‌ప్లస్ 13పై ఈ ప్రత్యేక ప్రీ-డీల్ ఇప్పటికే లైవ్‌లో ఉంది. స్టాక్ పరిమితంగా ఉన్నందున, ఆసక్తి ఉన్నవారు త్వరగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications