Robo Art: రోబో పెయింటింగ్‌కు ఆర్ట్ వరల్డ్‌ ఫిదా.. కళాకృతి విలువ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే..

AI painting: మానవ హస్తాలు ఎన్నో కళాకృతులకు జీవం పోయగలదు. ఒక్కసారి ఆర్ట్ గ్యాలరీకి వెళితే ఇలాంటి ఎన్నో కళాఖండాలు దర్శనమిస్తాయి. వీటిలో కొన్నింటి విలువ లక్షలు దాటి కోట్లలో ఉంటుంది. అంతగా ఆకట్టుకునే కళాకారులు ఈ భూమి మీద ఉన్నారు. అయితే కృత్రిమ మానవుడు తయారుచేసిన కళాకృతికి కూడా ఊహించని స్థాయిలో విలువ దక్కడం టెక్ సమాజాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది.

ప్రపంచంలోనే మొదటి హ్యూమనాయిడ్ AI కళాకారిణి ఐ-డా సృష్టించిన కళాఖండాన్ని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది. ఈ రోబో వేసిన పెయింటింగ్‌ ఇటీవల ఏకంగా 1 మిలియన్ డాలర్లకు అమ్మడు కావడం సెన్సేషన్ కు కారణమైంది. ఈ అరుదైన ఘనత ఆధునిక కంప్యూటింగ్ ఫాదర్ అలన్ టూరింగ్ ఫొటోకు దక్కింది.

Ai-Da paint auctioned for 1 million dollars shocked art world

మొదటి కంప్యూటర్ ప్రోగ్రామర్ ఆడా లవ్లేస్ పేరిట ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన ఆర్ట్ డీలర్ ఐడాన్ మెల్లర్ ఐ-డాను అభివృద్ధి చేశారు. కళ్ల స్థానంలో కెమెరాలు, చిత్రాలు రీమేక్ చేయడానికి చేయి మరియు AI ఆధారిత బ్రైన్ రోబోకు అమర్చారు. దీనివల్ల తన ముందు ఉన్న దృశ్యాన్ని పునఃసృష్టించగలదు. ఈ టాలెంట్‌తోనే సోత్‌బైస్ వేదిక మీద అత్యంత విలువైన ధరకు తన పెయింటింగ్‌ను విక్రయించి కళారంగంలో కొత్త చర్చలకు తెరతీసింది.

పోర్ట్రెయిట్ ఆఫ్ అలన్ టూరింగ్‌ మొదట 1.20 నుంచి 1.80 లక్షల డాలర్ల మధ్య పలుకుతుందని నిర్వహకులు భావించారు. కానీ ఆ అంచనాలను తలక్రిందులు చేస్తూ బిడ్డింగ్ లో దాదాపు 1 మిలియన్ డాలర్లకు పైగా కొల్లగొట్టింది. కళాకృతులను సేకరించే వారు కూడా AI ఉత్పత్తి చేసిన కళాప్రదర్శనలోని కొత్తతనాన్ని అర్థం చేసుకున్నట్లు ఈ ఘటనను బట్టి అర్థమవుతోందని భావిస్తున్నారు.

మరోపక్క రోబో వేసిన పెయింటింగ్‌కు అర్థం ఏమిటో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఐ-డాకు ఎలాంటి భావాలు లేవు. దృశ్య సమాచారాన్ని విశ్లేషించడం ద్వారానే కళాకృతులను సృష్టించగలదు. కాగా ఆర్ట్‌లో టెక్నాలజీ పాత్రపై పెద్ద డిబేట్ మొదలుపెట్టాలన్నది ఐ-డా సృష్టికర్త మెల్లర్ ఉద్దేశమని తెలుస్తోంది. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ మానవ, యాంత్రిక సృజనాత్మకత మధ్య లైన్ చేరిపేయగలదని ఆయన విశ్వాసం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+