న్యూ ఫోన్ లాంఛ్ కోసం డేట్ ఫిక్స్ చేసిన ఆపిల్..

టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ సరికొత్త ఐఫోన్ మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధం అవుతోంది. చౌకైన ఐఫోన్‌ను లాంచ్ చేయనున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సీఈవో టిమ్ కుక్ చేసిన పోస్ట్ యాపిల్ అభిమానుల్లో అంచనాలను పెంచేసింది.

ఈ మేరకు ఆ పోస్టులో ఫిబ్రవరి 19న తమ ఆపిల్ కుటుంబం నుంచి కొత్త ప్రొడక్ట్ మార్కెట్లోకి రిలీజ్ అవుతోందని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. ఆయన ప్రత్యేకంగా ఐఫోన్ ఎస్ఈ 4 పేరును ప్రస్తావించనప్పటికీ... కొత్తగా లాంచ్ అయ్యే ఫోన్ ఇదే అని టెక్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Apple ce tim cook announce date launch for new phone

ఐ ఫోన్ ఎస్ఈ 4 ఫీచర్లు..

ఇక కొత్తగా రిలీజ్ కానున్న ఫోన్ కు సంబంధించి మీడియా వర్గాలు ఇవే వాటి ఫీచర్స్ అంటూ చెబుతున్నారు. వాటిలో ఈ కొత్త ఫోన్ డిజైన్ ఐఫోన్ 14 లాగా ఉంటుందని, ఇందులో పెద్ద డిస్‌ప్లే, ఫేస్ ఐడి ఫీచర్ ఉంటుందని చెబుతున్నారు. అలానే ఈ ఎస్ఈ సిరీస్ లో హోమ్ బటన్‌ను కూడా పూర్తిగా తొలగించే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఇక ఈ మొబైల్ లో ఆపిల్ A18 చిప్‌సెట్‌ ఉంటుందని.. ఆపిల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అంతే కాకుండా ఈ ఏడాది యాపిల్ కొత్త ఐఫోన్ మాత్రమే కాకుండా అనేక కొత్త ఉత్పత్తులను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్తగా విడుదల చేయనున్న వాటి జాబితాలో M4 చిప్‌సెట్‌తో కూడిన మ్యాక్‌బుక్ ఎయిర్, ఐప్యాడ్, ఐప్యాడ్ ఎయిర్ అప్‌గ్రేడ్ వెర్షన్, ఆపిల్ వాచ్ సిరీస్‌లు ఉండనున్నాయని సమాచారం. మరోవైపు ఐఫోన్ కొత్త మోడల్ ఏదైనా లాంచ్ అవుతోందంటే.. హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆపిల్ స్టోర్ల వద్ద గ్యాడ్జెట్ ప్రియులు అర్ధరాత్రి నుంచే క్యూ లైన్లలో నిలబడి ఫోన్ లను కొనుగోలు చేయడం గతంలో పలు మార్లు సైతం చోటు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+