అంతరిక్షంలో కీలక ఘట్టం..

ISRO: అంతరిక్షంపై భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సహకారంతో మొట్టమొదటిసారిగా మానవ సహిత ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇది పరిపూర్ణంగా విజయవంతమైంది. కొద్దిసేపటి కిందటే అంతరిక్ష కేంద్రంతో ఈ మిషన్ అనుసంధానమైంది. ఎటువంటి అవాంతరాలు లేకుండా నలుగురు వ్యోమగాములు కూడా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నట్టయింది.

ఆక్సిమ్ 4 పేరుతో ఇస్రో.. ఈ మిషన్ ను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్ కు భారత్ సారథ్యాన్ని వహించింది. వైమానిక దళ వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా.. ఈ మిషన్ కు గ్రూప్ కెప్టెన్ గా వ్యవహరించారు. ఆయనతో పాటు స్లావోష్ ఉజ్నాన్స్ కీ, టిబోర్ కపు- హంగేరి, నాసాకు చెందిన పెగ్గీ విట్సన్.. ఐఎస్ఎస్ కు చేరుకున్నారు.

Axiom 4 Mission piloted by Shubhanshu Shukla successfully docks at the ISS

బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 12:01 నిమిషాలకు ఈ నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణం కట్టింది. ఎలాన్ మస్క్ కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగ సంస్థ స్పేస్ ఎక్స్.. ఈ రాకెట్ ను సమకూర్చింది. అమెరికా ఫ్లోరిడాలో నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది.

ఈ ఉదయం ఈ రాకెట్.. ఆక్సిమ్ 4 స్పేస్ క్రాఫ్ట్ ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ముందుగా నిర్దేశించుకున్న సమయానికి ఇది ఐఎస్ఎస్ తో అనుసంధానమైంది. ఈ మేరకు డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసినట్లు స్పేస్ ఎక్స్ సంస్థ ప్రకటించింది. నలుగురు వ్యోమగాములు ఇంకాస్సేపట్లో ఐఎస్ఎస్ లో అడుగు పెడతారని తెలిపింది.

మొత్తం ఏడు అంశాలపై శుభాన్షు శుక్లా టీమ్ పరిశోధనలు సాగిస్తుంది. ఈడిబుల్ మైక్రొయాలజీ, స్ప్రౌట్స్, మజిల్ రీజనరేషన్, టర్డిగ్రేడ్స్, ఎలక్ట్రానిక్ డిస్ ప్లే, సైనో బ్యాక్టీరియా, ఫుడ్ క్రాప్ సీడ్స్.. పై ఈ పరిశోధనలు ఉంటాయని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇదివరకే వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+