ఆ టౌన్ లో 65 రోజులు విచిత్ర చీకటి రాత్రులు: బయట అడుగు పెట్టాలంటే భయం
ఒకట్రెండు రోజులు ఎండ రాకపోతే ఉక్కిరిబిక్కిరికి గురి అవుతాం. ఊపిరి పట్టేసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. వింటర్ సీజన్ లో మరీనూ. ఎప్పుడెప్పుడు ఎండలో నిల్చుందామా అనిపిస్తుంది. చురచురమంటూ ఎండ వేడి తగిలితే గానీ మనకు ఉపశమనం కలగదు.. చాలా సందర్భాల్లో. అలాంటిది- అలస్కాలోని ఓ చిన్న టౌన్ లో ఏకంగా రెండున్నర నెలల పాటు సూర్యుడు కనిపించడు. ఎండ అనేదే పడదు. పగలు ఏదో, చీకటి ఏదో తెలియని విచిత్ర వాతావరణం నెలకొంటుంది.
ఆ టౌన్ పేరు ఉట్కియాగ్‌విక్ (Utqiagvik). 65 రోజుల పాటు చీకట్లోనే ఉంటుందిది. ఈ చీకటి రాత్రులు అక్కడ మొదలయ్యాయి కూడా. ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం సరిగ్గా 1:55 నిమిషాలకు సూర్యుడు అస్తమించాడు. ఇక మళ్లీ ఉదయించేది 2026 జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 1:22 నిమిషాలకు. అప్పటివరకు ఎండ పొడ అనేదే తగలదు అక్కడి వారికి. విద్యుత్ వెలుగుల్లోనే జీవితాలను గడుపుతారు. దీనికి మించిన ప్రత్యమ్నాయం వారికి లేదు.

ఆర్కిటిక్ సర్కిల్ కు ఉత్తరాన 300 మైళ్ల దూరంలో ఉందీ చిన్న టౌన్ ఉట్కియాగ్‌విక్. గతంలో బారో అని పిలిచేవారు. 2016లో పేరు మార్చుకుంది. అక్కడి జనాభా 4,600. భూ అక్షం వంపు కారణంగా ఈ విచిత్ర వాతావరణం అక్కడ నెలకొంటూ వస్తోంది. శీతాకాలంలో ఉత్తరార్ధగోళం సూర్యుడికి దూరంగా ఉండటం, ఉత్తర అక్షాంశ రేఖలో సూర్యుడు క్షితిజానికి దిగువన ఉండటం దీనికి కారణం. సూర్యుడు కనిపించకపోయినా, ఈ పట్టణం పూర్తిగా చీకటిలో మునిగిపోదు.
ప్రతిరోజు గంట నుంచి రెండు గంటలపాటు సంధ్యా సమయం నాటి వాతావరణం నెలకొంటుంది. అంటే సూర్యుడి వెలుగు కొంత సేపు ప్రసరిస్తుందన్నమాట. మధ్యాహ్నం వేళ లేత నీలిరంగు సహజ కాంతితో మెరిసిపోతూ కనిపిస్తుందీ ఉట్కియాగ్‌విక్. గంటో లేక రెండు గంటలో ఈ వెలుగు ఉంటుంది. మళ్లీ మామూలే.. చీకటి రాత్రులే. విద్యుత్ వెలుగులు, UV ల్యాంపుల సహాయంతో ఈ చీకటి కాలానికి వాళ్లు అలవాటుపడతారు.
ఈ చీకటి రాత్రుల సమయంలో ఉష్ణోగ్రత భారీగా పడిపోతుంటుంది. -20 నుండి -30 డిగ్రీల సెల్సియస్ వరకు క్షీణిస్తుంది. ప్రజలు ఎక్కువగా ఇళ్లలోనే ఉంటారు. పగటి సమయం లేకపోయినా స్కూళ్లు, ఆఫీసులు, ఇతర వ్యాపారాలు యథావిధిగా నడుస్తాయి. మనకు ఎండాకాలం, వర్షకాలంలాగే అక్కడి వారు దీన్ని ఓ రుతువుగానే భావిస్తారు. ఇక్కడి జీవితం యథావిధిగా సాగుతుంది. రెండున్నర నెలల తర్వాత సూర్యోదయ సమయంలో పండగ వాతావరణం నెలకొంటుంది. సూర్యోదయాన్ని వేడుకగా జరుపుకొంటారు.
వేసవిలో పరిస్థితి తారుమారవుతుంది. అప్పుడు ఉట్కియాగ్వీక్ దాదాపు మూడు నెలల పాటు నిరంతరాయంగా పగటి వెలుగును చవిచూస్తుంది. సూర్యుడు అస్తమించడానికి మొరాయిస్తాడా సమయంలో. దీన్ని "మిడ్‌నైట్ సన్" అని పిలుస్తారు. ఇది మే రెండో వారం నుండి ఆగస్టు ప్రారంభం వరకు కొనసాగుతుంది. రాత్రికి- పగటికి తేడా తెలియదక్కడి జనానికి ఆ సమయంలో.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications